ఈసారి ఎయిర్ ఫోర్స్ స్ర్కిప్ట్ తో ఘాజీ డైరెక్ట‌ర్?

`ఘాజీ`తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంలందుకున్నాడు యంగ్ డైరెక్ట‌ర్ సంక‌ల్ప్ రెడ్డి. సబ్ మెరైన్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కించిన ఈ వాస్త‌వ క‌థ‌కు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ల‌భించింది. జాతీయ అవార్డు సైతం అందుకున్న ద‌ర్శ‌కుడిగా సంక‌ల్ప్ ఖ్యాతికెక్కాడు. అయితే అవ‌కాశాలు మాత్రం ఆ స్థాయిలో రాలేదు. ఘాజీ త‌ర్వాత స్పేస్ నేప‌థ్యంలో వ‌రుణ్ తేజ్ హీరోగా అంత‌రిక్షం చిత్రాన్ని తెర‌కెక్కించాడు. కానీ ఆ సినిమా అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. కానీ టెక్నిక‌ల్ నేప‌థ్యంగల సినిమాలు చేయ‌డంతో దిట్ట అని సంక‌ల్ప్ మ‌రోసారి నిరూపించుకున్నాడు. అంత‌రిక్షం కూడా కొన్ని వాస్త‌వ సంఘ‌న‌ట‌లు ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించినదే.

ఇలాంటి క‌థ‌ల‌ను స్ర్కిప్ట్ రూపంలో మార్చ‌డంలో …దాన్ని క‌మ‌ర్శిలైజ్ చేయ‌డంలో సంక‌ల్ప్ ఆరితేరిన‌వాడిగా రెండు సినిమాల‌తోనే నిరూపించుకున్నాడు. కానీ మూస‌లో వెళ్లే టాలీవుడ్ కు సంక‌ల్ప్ ని ఎంక‌రేజ్ చేయ‌డంలో మాత్రం వెన‌క‌డుగు వేస్తూనే ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ యువ ట్యాలెంట్ పై బాలీవుడ్ క‌న్నేసింది. ఈసారి బాలీవుడ్ లోనే సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. అంత‌రిక్షం సినిమా చేస్తున్న‌ప్పుడే ఈ అవ‌కాశం వ‌చ్చింది. అయితే బాలీవుడ్లో సంక‌ల్ప్ ఎలాంటి స్ర్కిప్ట్ తో ముందుకెళ్తాడు? అన్న స‌స్పెన్స్ కొన్ని నెల‌లుగా నెల‌కొన్న నేప‌థ్యంలో తాజాగా దానికి తెర‌పైడింది.

ఈసారి కూడా ఈ యువ కెర‌టం త‌నదైన శైలిలో లోనే ముందుకెళ్తున్నాడు. ఇండియ‌న్ డిఫెన్స్ లో ఒక‌టైన ఇండియ‌ర్ ఎయిర్ ఫోర్స్ నేప‌థ్యం తో కూడిన స్ర్కిప్ట్ ను సిద్దం చేసుకున్న‌ట్లు స‌మాచారం. దేశంలో ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ లో జ‌రిగిన కొన్ని వాస్తవ సంఘ‌ట‌న‌లను ఆధారంగా చేసుకుని ఈ క‌థ సిద్దం చేసాడుట‌. ఇందులో బాలీవుడ్ న‌టుడు విద్యుత్ జ‌మాల్ హీరోగా న‌టిస్తున్నాడు. లాక్ డౌన్ స‌మ‌యంలో నే ఈ స్ర్కిప్ట్ సిద్దం చేసాడుట‌. వైర‌స్ వ్యాప్తి త‌గ్గిన అనంత‌రం షూటింగ్ ప్రారంభించ‌నున్నార‌ని స‌మాచారం. ఓ పెద్ద నిర్మాణ సంస్థ దీన్ని నిర్మించ‌నున్న‌ట్లు తెలిసింది.