Condom: రైఫిల్స్ రక్షణగా కండోమ్స్.. ఆర్మీ వాడిన షాకింగ్ టెక్నిక్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!

సాధారణంగా కండోమ్స్ అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేది ఒకటే.. అదే శృంగారం. ఆ సమయంలో గర్భధారణ, వ్యాధుల నివారణ కోసం ఉపయోగపడే గర్బనిరోధక సాధనం కండోమ్. అయితే కండోమ్ యుద్ధంలో ఉపయోగించారంట.. ఏంటి ఏదో తేడాగా అనిపిస్తుందా కానీ అది నిజం. అంతేకాదు 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో సైనికులు వీటిని విరివిగా వాడారంట.. అసలు యుద్ధంలో వీటితో పనేంటి.. కండోమ్స్ తో ఎలా యుద్ధం చేశారు అనుకుంటున్నారా. అయితే ఈ కథనాన్ని చూడండి.

యుద్ధంలో కండోమ్స్ ఎలా
అవును ఆశ్చర్యం కలిగించే ఈ నిజం ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 1971లో ఇండియా-పాక్ యుద్ధ సమయంలో, భారత సైనికులు తాము వాడే రైఫిల్స్ బ్యారెల్స్ (తుపాకుల గొట్టం)లో తేమ పోకుండా, తుప్పు రాకుండా ఉండేందుకు వాటి చివర భాగానికి కండోమ్స్ తొడిగేవారంట. దీనికి ప్రధాన కారణం.. అప్పటి ఆయుధాలు వాటర్‌ప్రూఫ్ మెటీరియల్స్‌తో తయారయ్యేవి కావు.. దీంతో అవి తేమ, నీటి కారణంగా తుప్పు పట్టేవి.

ఇలా జరగడం వలన అవసరమైన సమయంలో తుపాకీ పని చేని చేయక.. సైనికులు ఇబ్బంది పడేవారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయేవారు. అయితే దీనిని నివారించడానికి రైఫిల్స్ ముందు లబ్బరుతో తయారయ్యే కండోమ్స్ ని తొడిగేవారంట. దీనివల్ల గాలి, నీరు వెళ్లకుండా ఉండేది. యుద్ధ సమయంలో తుపాకులు పనిచేయకపోతే ప్రాణాలకే ప్రమాదం కాబట్టి, ఈ జాగ్రత్త తీసుకోవాల్సి వచ్చేది.

అయితే ఇది కేవలం ఆర్మీ మాత్రమే కాదు.. ఇండియన్ నేవీ కూడా అదే పద్ధతిని పాటించిందట. అప్పటి లింపెట్ మైన్స్ (ship hulls‌కి అంటించే బాంబులు)లో వాటిని ఉపయోగించడం ద్వారా నీటి లీక్‌ను ఆపేవారంట. నీరు చొరబడకుండా ఉండడం వలన బాంబులు సమర్థవంతంగా పని చేసేవంట. ముఖ్యంగా గెరిల్లా దళాలు, మావోయిస్టు గ్రూపులు.. పరిమిత వనరులు కలిగిన బలగాలు.. నేటికీ ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారంట.

ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. దీంతో రైఫిల్స్ ని కూడా అన్ని కాలాల్లో సమర్థవంతంగా పనిచేసే విధంగా మార్చారు. ఏదేమైనా ఓ గర్బనిరోధక సాధనం యుద్ధాన్ని రక్షించగలదా? అంటే… దాని జవాబు – “అవును” అని సైనికులే చెబుతున్నారు.