తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన సంగీత పెళ్లి తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉండిపోయారు. అడపా దడపా తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు.
అయితే ఈమె త్వరలోనే తెలుగు వెండితెరపై సందడి చేయబోతున్నారట. మహేశ్ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. ఈ సినిమాలో హీరోయిన్‌తో పాటు ఉండే ఓ కీలక పాత్రలో సంగీత నటించబోతున్నారట.
ఖడ్గం, శివపుత్రుడు, ఖుషీ ఖుషీగా, పెళ్ళాం ఊరెళితే, సంక్రాంతి వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు సంగీత. ఇది సంగీతకు మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందంటున్నాయి సినీ వర్గాలు. ఈ సినిమాలో సంగీతతో పాటు విజయశాంతి, బండ్ల గణేశ్ కూడా రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.