నా భార్య‌ను రేప్ చేస్తాన‌ని స్టార్‌హీరో బ్ర‌ద‌ర్ బెదిరించాడు

ప‌ర్స‌న‌ల్ గొడ‌వ‌లు ఇప్పుడెందుకు?

సుశాంత్ ఆత్మ‌హ‌త్య అనంత‌రం ర‌క‌ర‌కాల థియ‌రీలు తెర‌పైకొచ్చాయి. బాలీవుడ్ లో సినీపెద్ద‌లు బ‌య‌టి నుంచి వ‌చ్చిన‌వారిలో ఎవ‌రినీ ఎదగ‌నీకుండా చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. అందులో ఖాన్ ల కుటుంబంపైనా తీవ్ర ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ప‌నిలో ప‌నిగా ప‌ర్స‌న‌ల్ గొడ‌వ‌ల్ని తెర‌పైకి తెస్తూ సోష‌ల్ మీడియాల్లో హీటెక్కించేస్తున్నారు. అలానే ద‌బాంగ్ ద‌ర్శ‌కుడు అభిన‌వ్ క‌శ్య‌ప్ స‌ల్మాన్ కుటుంబ స‌భ్యుల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. స‌ల్మాన్ సోద‌రులు త‌న భార్య‌ను రేప్ చేస్తాన‌ని హెచ్చ‌రించార‌ని.. త‌మ ఇళ్ల‌లో ఆడ‌వారిని రేప్ చేస్తామ‌ని తీవ్రంగా భ‌య‌పెట్టార‌ని అభిన‌వ్ సిన్హా ఆరోపించ‌డం సంచ‌ల‌న‌మైంది. 2017లో త‌న‌పై సాగిన బెదిరింపుల ప‌ర్వాన్ని ఆయ‌న ఇప్పుడు మ‌రోసారి తెర‌పైకి తేవ‌డం వివాదాస్ప‌ద‌మైంది. స‌ల్మాన్ కుటుంబం త‌న‌ని దొంగ‌చాటుగా వెంటాడింద‌ని ఇప్ప‌టికీ వెంటాడుతున్నార‌ని తెలిపారు.

స‌ల్మాన్ కుటుంబం నుంచి ఎదురైన వేధింపుల వ‌ల్ల‌నే తాను భార్య నుంచి విడిపోవాల్సి వ‌చ్చింద‌ని త‌న కుటుంబంలో తీవ్ర‌మైన క‌ల‌త‌లు చెల‌రేగాయ‌ని ఆయ‌న తెలిపారు. బెదిరింపుల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా కేసు పెట్ట‌లేద‌ని.. వారికే వ‌త్తాసు ప‌లికార‌ని కూడా అభిన‌వ్ ఆరోపించారు. సుశాంత్ లా త‌ప్పుడు ప‌ని చేయొద్ద‌ని కొత్త‌వారైనా కానీ ధైర్యంగా ఉండాల‌ని తాను స‌ల్మాన్ కుటుంబాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాన్ని తెలిపారు. త‌న ట్వీట్ల‌ను వైర‌ల్ చేయాల‌ని ఆయ‌న కోర‌డం సంచ‌ల‌న‌మైంది.