తనకు భర్త, పిల్లలు కూడా ఉన్నారన్న విషయాన్ని గురించి బయటపెట్టిన నటి మాధవిలత!

Actress Madhavi About Drugs In Tollywood

నటి మాధవి లత తెలుగు తమిళ సినిమాలలో నటించిన తెలుగు నటి. ఆమె భారతీయ రాజకీయ నాయకురాలు కూడా. మాధవి 2018లో భారతీయ జనతా పార్టీలో చేరారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆమె పూర్తి పేరు మాధవి లత పసుపులేటి.

నటి మాధవి లత ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన సవాళ్లను పోరాటాలను హైలైట్ చేసింది. ఆమె తన తొలి చిత్రం చిత్రీకరణ సమయంలో తన సహనటుడు తనతో డేటింగ్ చేయాలనుకున్నాడని కానీ ఆమె నిరాకరించిందని కూడా పేర్కొంది. మొదటి దర్శకుడు తనను కాస్టింగ్ కౌచ్ తో వేదించాడని తెలిపింది.

దానిని ఆమె తిరస్కరించినప్పుడు, అతను తన కెరీర్‌కు హాని కలిగించడానికి ప్రయత్నించాడని ఆమె పేర్కొంది. అందుకే ఆమెకు ఎక్కువ ఆఫర్‌లు కూడా రాలేదంటు చెప్పడం జరిగింది. పదేళ్లుగా తనను, తన కుటుంబాన్ని ఎవరో చిత్రహింసలకు గురిచేస్తున్నారని, దీంతో తాను ఎంతో బాధ పడుతున్నానని ఆమె అంగీకరించింది. ఇకపోతే నటి మాధవికి తన ఇన్‌స్టాగ్రామ్‌లో 451 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

అలాగే ఆమెకు యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఆమె 2013లో యూట్యూబ్ ఛానెల్‌లో చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ, ఆహార సంరక్షణ, యోగా, ధ్యానం మొదలైన ఆరోగ్యానికి సంబంధించిన అనేక అంశాలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆ పోస్ట్‌ల ప్రకారం, ఆమె తన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందని తెలుసుకోవచ్చు.

మాధవి లత స్నేహితుడా, అంబల, నచ్చావులే వంటి సినిమాలను చేసింది. తెలుగులో రొమాంటిక్ చిత్రం నచ్చవులే తో ఆమె తన చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. ఒక విమర్శకుడు తను ఆ పాత్రలో ఆమె ఆశాజనకంగా ఉంటుందని చెప్పింది. మాధవి తరువాత యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఒక సంవత్సరం గడపడం జరింగింది. కోవెంట్రీ విశ్వవిద్యాలయంలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో మాస్టర్స్ అర్హతను అభ్యసించారు.

సినిమాల్లో వృత్తిని పునఃప్రారంభించడానికి తిరిగి హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఆ తర్వాత ఆమె ఇండియాకు తిరిగి వచ్చింది. ఆమె అరవింద్ 2 తో పాటు తారక రత్నతో విడుదల కాని చూడాలని చెప్పలని వంటి చిత్రాలలో పని చేసింది. అందులో ఆమె చెవిటి, మూగ అమ్మాయిగా నటించింది.

అయితే గతంలో ఈమెకు పెళ్లయి పిల్లలు ఉన్నారని బాగా వార్తలు వినిపించాయి. దీంతో మాధవి లత గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నిజానికి తనకు చిన్నప్పటి నుంచి రకరకాల పరిస్థితులను చూడడం వల్ల తనకు పెళ్లిపై ఆసక్తి ఉండేది కాదని మహిళకు వయసు రాగానే పెళ్లి చేయకూడదన్న అభిప్రాయాన్ని తను వ్యక్తం చేసింది.

అయితే తన కుటుంబ సభ్యులు ఆమెకోసం వరుడిని వెతుకుతున్నారని ఆమె తెలిపింది. కరోనా లాక్‌డౌన్ కాలంలో నితిన్, నిఖిల్ వంటి స్టార్‌లను ఆమె నిశ్చితార్థం చేసుకుందని ఆమె భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. అలానే ఆమె న్యూ యార్క్ లో పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యిందని ఇంకా ఆమెకు పిల్లలు కూడా పుట్టారు గతంలో భారీగా పుకార్లు షికార్లు చేశాయి.

కానీ అవన్నీ నిజం కాదని ఆమె తానా సభల కోసం ఇంకా తనకు వచ్చిన ఒక జాబ్ ఆఫర్ కోసం ఆరు నెలలకు ఒకసారి వెళ్ళేదానినని చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ అబద్దాలని వాటిని కొట్టిపారేశారు మాధవి లతా. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. అలాగే ఆమె రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు కాబట్టి సినిమా అవకాశాలు కూడా రావడం లేదని తెలిసింది.