Vijay Beast Story Revealed : “బీస్ట్” సినిమా చూడటం అవసరమా? ఎలా ఉంటుందో దర్శకుడే చెప్పేసాడు.!

Vijay Beast Story Revealed : ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధం అవుతూ వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ భారీ ఏక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “బీస్ట్” కూడా ఒకటి. వరుణ్ ‘డాక్టర్’ ఫేమ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం చాలా త్వరగానే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు “కేజీఎఫ్ 2” లాంటి పాన్ ఇండియా సెన్సేషన్ సినిమాకి పోటీగా రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

దాని కన్నా ఒక్క రోజు ముందుగా రిలీజ్ కి వస్తున్న ఈ సినిమాపై దర్శకుడు నెల్సన్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో అసలు ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పేసాడు. తన మాటల ప్రకారం అయితే ఇది అంత ఆసక్తిగా ఎదురు చూసి థియేటర్స్ లో చూడదగిన రేంజ్ లో ఉన్నట్టు అనిపించడం లేదు.

కథ చాలా రొటీన్ గానే ఉంటుంది. అని ప్రధాన పాత్ర దారుడుకి ఒక సవాలు ఎదురైతే దానిని అతడు ఎలా ఎదుర్కొంటాడు ఆ సమస్యలో కొంతమంది చిక్కుకుంటే వారిని అతడు ఎలా కాపాడుతాడు అనేది సినిమాలో మెయిన్ ప్లాట్ పాయింట్ అట. దీనితో ఈ సినిమా ఏమీ అంత ఊహించని రేంజ్ కథ ఉండెదిలా అనిపించట్లేదు.

కేవలం ఏక్షన్ కామెడీ కోసం చూడొచ్చు అని దర్శకుడే అన్నాడు అని కోలీవుడ్ మీడియా వర్గాల్లో టాక్ వైరల్ అవుతుంది. మరి ఇలాంటి సింపుల్ స్టోరీ ని దర్శకుడు ఎలా డీల్ చేసాడో చూడాలి. ప్రస్తుతానికి అయితే అభిమానులు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అది చూస్తే అందరికీ ఒక క్లారిటీ రావొచ్చు కానీ సినిమా లైన్ ప్రకారం అయితే ఎక్కడా అంత ఆసక్తి అనిపించట్లేదు. మరి చూడాలి ఎలాంటి ఫలితాన్ని ఈ సినిమా అందుకుంటుందో అని. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించాడు.