చిరంజీవి చేసిన డోనేషన్స్ 150 కోట్లట

Fans revealed Chiranjeevi donations details
Fans revealed Chiranjeevi donations details
 
కరోనా కష్ట కాలంలో ఎలాంటి సహాయం చేయట్లేదని మెగాస్టార్ చిరంజీవి మీద ఒక వర్గం పనిగట్టుకుని మరీ దాడి చేసింది.  జనం కష్టాలు పడుతుంటే చిరంజీవి చేపల కూర చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారని చెడు ప్రచారం చేశారు.  కానీ చిరంజీవి మాత్రం తాత్కాలిక దానాలతో ఆగిపోకుండా శాశ్వత పరిష్కారాల దిశగా ఆలోచించి ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి తన సేవా గుణం ఎలాంటిదో మరోసారి నిరూపించారు. 
 
చిరంజీవి మీద జరుగుతున్న అనైతిక దాడికి అభిమానులు సైతం నొచ్చుకున్నారు.  సామాజిక మాధ్యమాల్లో చిరంజీవి సేవా కార్యక్రమాల గురించి, గుప్త దానాల గురించి పెద్ద ఎత్తున చర్చ పెడుతున్నారు. చిరంజీవి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించి ఎంత సేవ చేశారు, వీటి కోసం సొంత నిధులు ఎంత ఖర్చు చేశారు లాంటి సంగతులను బయటపెడుతున్నారు. చిరంజీవి సేవా కార్యక్రమాల్లో ముందు నుండి పాలుపంచుకుంటూ వచ్చిన కొందరు సీనియర్ అభిమానులు సైతం చిరంజీవి సేవా కార్యక్రమాల గురించి సోషల్ మీడియాలో వివరాలు వెల్లడిస్తున్నాయి. 
 
చిరంజీవి ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ కోసం విరాళాలు కాకుండా తన సొంత నిధులు 100 నుండి 120 కోట్ల వరకు వెచ్చించి ఉంటారని, ఇక తాజాగా ఏర్పాటుచేస్తున్న ఆక్సిజన్ బ్యాంక్స్ కోసం ఇప్పటికే 30 కోట్లు ఖర్చు చేశారని ఇలా మొత్తంగా150 కోట్ల వరకు చారిటబుల్ ట్రస్ట్ కోసం ఖర్చు పెట్టారని, ఇంకా ఇతర సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారని, చేస్తున్నారని అలాంటి వ్యక్తి మీద ఇలాంటి విమర్శలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆంటున్నారు.