ప్రభాస్ “సలార్” ఏ లెవెల్లో ఉంటుందో ఒక్క మాటలో తేల్చేసిన యూనిట్.!

ఇప్పటి వరకు ఇండియన్ సినిమా దగ్గర ఏక్షన్ ఎలిమెంట్స్ పరంగా చూస్తే బిగ్గెస్ట్ ఏక్షన్ ఎంటర్టైనర్ గా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన భారీ చిత్రం “సలార్” అనే చెబుతారు. రాకింగ్ స్టార్ యష్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ లతో చేసిన ఈ చిత్రం రికార్డు వసూళ్లతో అదరగొట్టింది.

ఇక ఈ సినిమానే భారీ ఏక్షన్ అందులోని వైలెన్స్ కూడా ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది. అయితే దీని తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో “సలార్” అనే అంతకు మించి ఏక్షన్ సినిమాని నీల్ అయితే అనౌన్స్ చేసాడు. ఇక ఈ సినిమా కేజీఎఫ్ కి పదింతలు ఉంటుంది అని తానే చెప్పడంతో అంచనాలు వేరే లెవెల్ కి వెళ్లాయి.

అయితే ఈ సినిమాలో వైలెన్స్ శాతం ఎక్కువే ఉంటుంది అని ఆల్రెడీ చెప్పకనే చెప్పారు. అసలు సినిమా అనౌన్స్ చేసినప్పుడే వైలెంట్ మెన్ అంటూ స్టార్ట్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ట్విట్టర్ లో సింగిల్ వర్డ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఎవరైనా సరే తాము  అనుకున్నది జస్ట్ సింగిల్ వర్డ్ లో చెప్తున్నారు.

మరి ఈ సమయంలో కూడా ఈ సినిమా మేకర్స్ “వైలెంట్” అంటూనే పోస్ట్ చేశారు. దీనితో అయితే ఈ సినిమా ఏ లెవెల్ కంటెంట్ తో ఉంటుందో మేకర్స్ తేల్చి పారేసారు. మరి ఈ చిత్రంలో వైలెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు ఆగక తప్పదు.