సాహూ రేపు మరో మెట్టు పైకి !

సాహో కొత్త‌ టీజ‌ర్‌ గెట్ రెడీ

ప్ర‌భాస్- శ్ర‌ద్ధా క‌పూర్ జంట‌గా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో యువి క్రియేష‌న్స్ నిర్మిస్తున్న‌ `సాహో` ఆగ‌స్టు 30న రిలీజ‌వుతోంది. స‌రిగ్గా నెల‌రోజుల స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ నెల‌రోజులు వ‌రుస‌గా భారీ ఈవెంట్ల‌తో ప్ర‌చారం హోరెత్తించేందుకు యువి సంస్థ స‌న్నాహ‌కాల్లో ఉంది. అన్ని మెట్రో న‌గ‌రాల్లో ప్ర‌త్యేక ఈవెంట్ల‌కు ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఈ సినిమాకి సంబంధించిన లిరిక‌ల్ వీడియోల‌తోనూ ఇప్ప‌టికే ప్ర‌చారంలో స్పీడ్ పెంచారు.

ఇటీవ‌లే రిలీజైన `సైకో స‌య్యాన్..` గీతం యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకుంది. బాలీవుడ్ మార్క్ లో ఈ పాట ట్యూన్ ఉంద‌ని ప‌లువురు విశ్లేషించారు. తాజాగా `ఏ చోట నువ్వున్నా` అంటూ సాగే సాంగ్ టీజ‌ర్ ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మంగ‌ళ‌వారం నాడు నాలుగు భాష‌ల్లో ఈ టీజ‌ర్ ని రిలీజ్ చేస్తున్నారు. `ఏ చోట నువ్వున్నా..` – తెలుగు, ఎన్ని సోని-త‌మిళ్‌, త‌మిళ్‌- మాజ‌యుమ్ తీయుమ్, మ‌ల‌యాళం-ఏకాంత తార‌మే.. అంటూ సాగే సాంగ్ టీజ‌ర్ ల‌ను రిలీజ్ చేయనున్నారు. తాజాగా రిలీజ్ కానున్న లిరిక‌ల్ వీడియోలో శ్ర‌ద్ధాతో ప్ర‌భాస్ రొమాన్స్ హై రేంజులో ఉంటుంద‌నే అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో టీ సిరీస్ అధినేత‌లు గుల్ష‌న్ కుమార్ – భూష‌ణ్ కుమార్ సంయుక్త స‌మ‌ర్ప‌ణ‌లో రిలీజ్ చేస్తున్నారు. చైనా మిన‌హా ఇత‌ర దేశాల్లో ఫ‌ర్స్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నుంది. తెలుగు రాష్ట్రాల బిజినెస్ గురించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.