స్వీయనిర్బంధం బోలెడన్ని పాఠాల్ని నేర్పిస్తోంది. ఇక ఇదే నిర్భంద సమయంలో పలువురు సెలబ్రిటీల పెళ్లి మాట వేడెక్కించేసింది. నిఖిల్ ఇప్పటికే తాను ప్రేమించిన డాక్టర్ పల్లవి వర్మను పెళ్లాడేసాడు. నితిన్ తన పెళ్లిని డిసెంబర్ కి వాయిదా వేసుకున్నాడని ప్రచారమైంది. రానా తన ప్రేయసిని పరిచయం చేసి రోకా వేడుకను జరుపుకున్నాడు. త్వరలోనే నిశ్చితార్థం .. ఆ తర్వాత పెళ్లికి ప్లాన్స్ వేస్తున్నాడు.
ఈలోగానే సాహో ఫేం యువదర్శకుడు సుజీత్ పెళ్లికి రెడీ అవుతున్నాడన్న వార్త వేడెక్కిస్తోంది. చాలా చిన్న వయసులో 300కోట్ల బడ్జెట్ సినిమాని తెరకెక్కించిన డేరింగ్ డైరెక్టర్ గా సుజీత్ పేరు మార్మోగింది. ఇక అతడు టిక్ టాక్ లో ఫేమస్ అయిన ప్రవళ్లికను పెళ్లాడుతున్నాడని తెలిసింది. టిక్ టాక్ స్టార్ గా ఇంకా స్క్రిప్ట్ రైటర్ గా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ప్రవళ్లికతో సుజీత్ కు గత కొన్నాళ్లుగా పరిచయం ఉంది. వీరి పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారిందట. పెద్దల్ని ఒప్పించి పెళ్లాడుతున్నారు. ఇక ప్రవళ్లిక ఇంతకుముందు నానీ నటించిన సినిమాకు స్క్రిప్టు రైటర్ గానూ పని చేశారట.