Vijay : ఎన్టీఆర్, రామ్ చరణ్ ను ఫాలో అవుతున్న కోలీవుడ్ దళపతి..!

Vijay : కోలీవుడ్ దళపతి విజయ్ తీస్తున్న చిత్రం బీస్ట్, ఇందులో పూజ హెగ్డే హీరోయిన్.ఈ సినిమాకి దర్శకుడు నెల్సన్. ఇక ఈ సినిమా ను ఏప్రిల్ 14 న విడుదల చేయడానికి ప్రయత్నిస్తోంది బీస్ట్ టీం. ఇక ఈ సినిమా యష్ నటించిన KGF 2 తో పోటీపడబోతోంది.ఇక రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల అవడం రెండు సినిమాలకు నష్టమే. దీన్ని ఎలా సరిదిద్దుకుంటారో చూడాలి. విజయ్ ప్రొమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ ను అనుసరించాలనుకుంటున్నారట.

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రాజమౌళి అన్ని భాషలలోనూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేసినా ఇంటర్వ్యూ లపై దృష్టి పెట్టారు. ఇక పెయిడ్ ప్రొమోషన్స్ కూడా బాగానే జరిగిందట ఆర్ఆర్ఆర్ సినిమాకు. ఇక ఈ సూత్రన్నే ఫాలో అవ్వాలనుకుంటున్నాడట విజయ్. తన మార్కెట్ పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ తో పాటు హిందీ లో చిత్ర విడుదలకోసం ప్రయత్నిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో సినిమా విడుదలచేయాలనుకోవడం తో ఎందుకు తగ్గట్టుగా ప్రచారం కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.ఇక ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25 న విడుదలకు సిద్ధంగా ఉంది.రామ్ చరణ్, ఎన్టీఆర్ ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషలలో విడుదలవనుంది.ఇందుకు తగ్గట్టు ప్రచారం కార్యక్రమాలు జోరు పెరిగింది.

విజయ్ ఇటీవల సూపర్ హిట్ కొట్టిన మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి తో కలిసీ నటించారు. ఈ చిత్రం మొదటి కరోనా లాక్ డౌన్ తర్వాత వచ్చినా మంచి వసూళ్లు రాబట్టుకుంది. ఇక విజయ్ ఇపుడు అంతకంటే ఎక్కువ వసూళ్లు బీస్ట్ ద్వారా కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన అరబిక్ కుతు పాట సామాజిక మధ్యమాలలో రికార్డులు సృష్టిస్తోంది.అరబిక్ కుతు పాటను ఎంత వరకు 175 మిలియన్ కోట్లకు పైగా వీక్షించినట్టు తెలుస్తోంది. ఇక ఎన్ని పాలనలతో వస్తోనా బీస్ట్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏమవుతుందో చూడాలి.