‘ఉప్పెన’ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే రికార్డ్ స్థాయి వసూళ్లను అందుకున్నాడు. ఒక్క సినిమాతోనే మాస్ జనాల్లో ముఖ్యంగా మెగా అభిమానుల్లో బోలెడంత క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ‘ఉప్పెన’ లాంటి భారీ హిట్ తర్వాత ఏ హీరో అయినా కమర్షియల్ హీరోగా పాతుకుపోవాలని చూస్తాడు. పక్కా మాస్ కథలను ఎంచుకుని సినిమాలు చేస్తాడు. కానీ వైష్ణవ్ తేజ్ వేరేగా ఆలోచిస్తున్నాడు. ఫస్ట్ సినిమా హిట్ అయింది కదా అని తనను తాను గొప్పగా ఊహించేసుకోవట్లేదు. ఉన్నపళంగా భారీ కథలను చేయాలని అస్సలు అనుకోవట్లేదు. ముందు నటుడిగా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.
అందుకే కథా బలమున్న సినిమాలనే చేస్తున్నాడు.ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి అన్నపూర్ణ బ్యానర్లో ఉంది. ఈ చిత్రాన్ని పృథ్వి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా ఉండనుంది. ఇందులో తేజ్ హాకీ ప్లేయర్ పాత్రలో కనిపిస్తాడట.పాత్రలో పర్ఫెక్షన్ కోసం చాలా కష్టపడుతున్నాడట. నటనకు స్కోప్ ఉండే పాత్ర కావడంతో వైష్ణవ్ తేజ్ ఈ సినిమాకు సైన్ చేశాడట. మొత్తానికి వైష్ణవ్ తేజ్ అందరి హీరోల్లా కమర్షియల్ కథల వెనుక పరిగెత్తకుండా తనను నటుడిగా నిలబెట్టే కథలను, పాత్రలను ఎంచుకుంటున్నాడు.