ఓ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ వస్తున్నప్పుడు ఎంతో కొంత కొత్తదనం ఆశిస్తాం..అందులోనూ అపరిచితుడు,పితామగన్ వంటి సినిమాలు చేసిన విక్రమ్ వంటి హీరోనుంచి అయితే మరీను. అయితే దర్శకుడు హరి కు అవేమి పట్టినట్లు లేవు. తన రొటీన్ రొట్టకొట్టుడు స్క్రీన్ ప్లేని తీసి వదిలాడు. అవును..ఇదంతా ‘సామి’ సినిమా గురుంచే. ఈ శుక్రవారం రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో దారుణంగా ఫెయిలైంది.
ఈ సినిమాలో హీరో సివిల్స్ పాసైన హీరో తన తండ్రిని చంపిన రౌడిపై పగ తీర్చుకోవటానికి ఐఎఎస్ అవుతాడు. ఆ సన్నివేశాలు అన్ని అతికే అతిగా సాగుతూంటాయి. గతంలో హీరో..తన కుటుంబంని నాశనం చేసినవారిపై పగ తీర్చుకోవటానికి ఉద్యోగం సద్యోగం లేకుండా విలన్ ని నాశనం చేయటమే జీవితాశయంగా తిరుగుతూంటేవాడు. ఇప్పుడు..హీరో ఓ ఉద్యోగం సంపాదించి మరీ విలన్ ని దెబ్బ కొడతాడు. అంతే తేడా.
ఈ సినిమాలో సన్నివేశాలు తమిళ అతిని అంతు లేకుండా ప్రతీ సన్నివేశంలోనూ ఎలివేట్ చేస్తూ …విసుగు తెప్పిస్తాయి. దాంతో తమిళం మాట ఎలాగున్నా తెలుగులో మాత్రం ఈ సినిమా కష్టమే అనిపిస్తుంది. మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా బి,సి సెంటర్ కు కొంతలో కొంత ఓకే అవ్వచ్చేమో కానీ అంతకు మించి ముందడగు వేయటం కష్టం అని తేలుతుంది.