సూచన: ఇది కేవలం ట్విట్టర్ రివ్యూ మాత్రమే..
డార్లింగ్ ప్రభాస్ నటించిన `సాహో` ఎలా ఉంది? అంటే అంతా మాయలానే ఉందన్నది ఇప్పటికే అందిన రిపోర్ట్. దుబాయ్ లో తొలి ప్రీమియర్ వీక్షించిన జనం.. అలాగే అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా తొలి ప్రీమియర్ వీక్షించిన ప్రేక్షకుల ట్విట్టర్ రివ్యూలతో సాహోపై చాలా వరకూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అసలింతకీ సాహో ఎలా ఉంది? ప‌్రభాస్- సుజీత్ చెప్పినట్టే ఊహించినంత థండర్ బోల్ట్ థ్రిల్లరేనా? ఇందులో కథ ఎలా ఉంది? కథనం సంగతేంటి? యాక్షన్ ఫ్లేవర్ ఎలా ఉంది?.. గ్యాంగ్ స్టర్లతో ఛేజింగ్ సీన్స్.. భారీ పోరాటాలు.. శ‌్రద్ధాతో లవ్ సీన్స్.. ప్రభాస్ నటన వగైరా వగైరా ఎలా ఉన్నాయి? అంటే వీటన్నిటికీ ట్విట్టర్ రివ్యూలు చాలా వరకూ క్లారిటీనిచ్చాయి.
`సాహో` గురించి ఐదు రోజుల ముందే `ఫిల్మ్‌నగర్ టాక్`లో చెప్పినట్టే.. ఈ సినిమా భారీ యాక్షన్ అన్న కోణంలో రియల్ విజువల్ ఫీస్ట్. కానీ ఈ సినిమాకు కథ పెద్ద మైనస్ గా మారింది. విజువల్ గ్రాండియారిటీ కోసం.. భారీ యాక్షన్ .. ఛేజ్ సీన్ల కోసం విచ్చలవిడిగా పెట్టిన ఖర్చు తెరపై అద్భుతంగా వర్కవుటైంది. భారీ యాక్షన్ సీన్స్ గగుర్పొడిచేలా చేస్తాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే గూస్ బంప్స్ గ్యారెంటీ. సినిమా చూస్తున్నంత సేపూ ప్రతి యాక్షన్ సీన్ నెవ్వర్ బిఫోర్. మైండ్ బ్లోయింగ్ అని పొగిడేస్తారు. అయితే అసలు ఈ సినిమా కథేంటి? అని అడిగితే ఎవరూ చెప్పలేరు. కథ పరంగా నీరసం వచ్చేలా చేశారు. అలాగే ఒకరిని మించి ఒకరుగా బరిలోకి దిగే విలన్లు పెద్ద గందరగోళం సృష్టించారు. కథను డ్రైవ్ చేసిన విధానంలోనూ గందరగోళం నెలకొంది. అప్పుడప్పుడు వచ్చే మెరుపుల్లాంటి యాక్షన్ సీన్లను మాత్రం కుర్చీ అంచుపై కూచుని చూస్తారు.
ఇక ఈ సినిమాలో హైలైట్స్ ఏవి? అంటే… ప్రభాస్ నటన.. భారీ యాక్షన్ సీన్లు.. ప్రొడక్షన్ విలువలు.. క్లైమాక్స్ ఇలా గూస్ బంప్స్ కలిగించే విషయాలెన్నో ఉన్నాయి. మైనస్ లు ఏమిటి? అంటే.. కథ, కథనంలోని గందరగోళం.. కథలో అంత గమ్మత్తయిన విషయం లేకపోవడం.. అలాగే ఇంత భారీ కాన్వాసుతో తీసిన సినిమా విషయంలో సుజీత్ అనుభవ లేమి కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇకపోతే పాటలు విజువల్ వండర్ ని తలపిస్తాయి. గిబ్రాన్ రీరికార్డింగ్ పెద్ద ప్లస్ కానుంది. మొత్తానికి సాహో ఓవరాల్ రిపోర్ట్ ఏమిటి? అని ప్రశ్నిస్తే.. ఇది కేవలం యావరేజ్ అని సామాన్య రివ్యూవర్ల నుంచే కాదు.. క్రిటిక్స్ నుంచి టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తెలుగు మీడియా ఇంటర్వ్యూల్లో డార్లింగ్ ప్రభాస్ చెప్పినట్టే అంతా మాయలా ఉందీ సినిమా అన్న టాక్ వినిపిస్తోంది.