ఫ్లాష్ ఫ్లాష్ : సాహో ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్

`బాహుబ‌లి` సిరీస్ త‌ర్వాత డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన `సాహో` కోసం ప్ర‌పంచం మొత్తం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంకో ఐదు రోజులే.. ఈ టెన్ష‌న్ ఇలానే అంత‌కంత‌కు రెయిజ్ అవుతూనే ఉంటుంది. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించిన ఈ సినిమా జాత‌కం బాక్సాఫీస్ వ‌ద్ద ఎలా ఉండ‌బోతోందోన‌న్న ఉత్కంఠ ట్రేడ్ వ‌ర్గాల్ని నిలువ‌నీయ‌డం లేదు. ప్ర‌భాస్ పై న‌మ్మ‌కంతో డిస్ట్రిబ్యూట‌ర్లు దాదాపు 320 కోట్లు వెద‌జ‌ల్లి ప్ర‌పంచ‌వ్యాప్త‌ థియేట్రిక‌ల్ రైట్స్ కొనుక్కున్నారు. ఆ మేర‌కు షేర్ వ‌స్తేనే ఈ సినిమా విజ‌యం సాధించిన‌ట్టు. బాహుబ‌లిని మించిన బ‌డ్జెట్ తో ఈ సినిమాని నిర్మించి యు.వి.క్రియేష‌న్స్ చేసిన సాహ‌సానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీపండితులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మేకింగ్ వీడియోలు, టీజ‌ర్, ట్రైల‌ర్ ప్ర‌తిదీ ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ వ‌స్తోంది! అన్న న‌మ్మ‌కాన్ని పెంచాయి. అయితే ఇంత భారీ అంచ‌నాల న‌డుమ రిలీజ‌వుతున్న సాహో ఎలా ఉండ‌బోతోంది? ఈ సినిమా ఏఏ వ‌ర్గాల‌ ప్రేక్ష‌కుల్ని టార్గెట్ చేసి తెర‌కెక్కించారు? అస‌లు ఫిల్మ్ న‌గ‌ర్ టాక్ ఎలా ఉంది? అన్న‌ది పరిశీలిస్తే తెలిసిన సంగ‌తులు ఇవి.

`సాహో` అంద‌రూ ఊహించిన‌ట్టుగానే ఇండియ‌న్ సినిమా స్క్రీన్ పై మునుపెన్న‌డూ చూడ‌ని భారీ యాక్ష‌న్ చిత్రం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా ఆద్యంతం ప్ర‌భాస్ ని ఓ రేంజులో చూపించారు. అత‌డు రూపం.. కాస్ట్యూమ్స్.. స్టైల్స్.. స్టంట్స్ ప్ర‌తిదీ గూస్ బంప్స్ ర‌ప్పించ‌డం ఖాయం అని తెలుస్తోంది. సుజీత్ పూర్తిగా ప్ర‌భాస్ పాత్ర‌ని పీక్స్ లో చూపించ‌డ‌మే ధ్యేయంగా స‌న్నివేశాల్ని తెర‌కెక్కించారు. ఇక అత‌డు ముందే చెప్పిన‌ట్టే ఈ సినిమాలో ఒకే స‌న్నివేశం ప‌దే ప‌దే రిపీట‌వుతుంది. అది హాలీవుడ్ లో ప‌లు చిత్రాల‌కు ఉప‌యోగించిన మోస్ట్ స‌క్సెస్ ఫుల్ స్క్రీన్ ప్లే ఫార్ములా. ఒకే యాక్ష‌న్ సీన్ ప‌దే ప‌దే రిపీట‌వుతుంది. అయితే దానికి ముందు దానికి త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న‌ది ఉత్కంఠ క‌లిగేలా చూపించారు. అయితే ఈ సినిమాకి మైన‌స్ లు లేవా? అంటే.. ఎంత గొప్ప హైలైట్స్ ఉంటాయో.. అంతే నెగెటివ్ పాయింట్స్ ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ న‌ట‌న‌.. ప్రొడ‌క్ష‌న్ విలువ‌లు.. భారీ యాక్ష‌న్ – ఛేజ్ లు.. వ‌ర‌ల్డ్ క్లాస్ వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ ఇలా అన్ని కోణాల్లో వండ‌ర్ ఫుల్ గా ఉంటుంది. 2.55 గం.ల సినిమాలో ప్ర‌తి పావుగంట‌కు ఓ భారీ యాక్ష‌న్ ఛేజ్ ని తెర‌పై ఆవిష్క‌రించారు. కానీ ఈ సినిమాలో క‌థ లేదు. క‌థ‌ను డ్రైవ్ చేయ‌డానికి స్కోప్ అన్న‌దే లేదు. అలాగే స్క్రీన్ ప్లే ప‌రంగా ఆశించినంత గ్రిప్ వ‌ర్క‌వుట్ కాలేదు. ప్ర‌భాస్- శ్ర‌ద్ధా క‌పూర్ మ‌ధ్య ల‌వ్ సీన్స్ ప‌ర‌మ రొటీన్ గానే ఉంటాయ‌ట‌. అలాగే ఒక‌రొక‌రుగా వ‌చ్చి భారీ పోరాటాల‌కు దిగే విల‌న్ల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌డం క‌న్ఫ్యూజ్ చేస్తుంది. ఇవ‌న్నీ మైన‌స్ లు అని చెబుతున్నారు. అయితే మాస్ కి కావాల్సిన భారీ యాక్ష‌న్ ఈ చిత్రంలో హైలైట్ గా ఉంటుంది. తొలి వీకెండ్ వ‌సూళ్ల‌కు డోఖా లేక‌పోయినా లాంగ్ ర‌న్ లో ఎంత‌వ‌ర‌కూ నిల‌దొక్కుకుంటుంది? అన్న‌ది చూడాల్సి ఉంటుంద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. రిలీజ్ ముందు హైప్ దృష్ట్యా ఓపెనింగ్‌ డే రికార్డులు, తొలి వీకెండ్ రికార్డులు సాహో ఖాతాలోకి చేర‌తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్ర‌తి సినిమాకి ప్ల‌స్ లు మైన‌స్ లు ఉంటాయి. సాహోకి ఉన్న‌ ప్ల‌స్ ల‌ను భేరీజు వేసుకుంటే ఇది యావ‌రేజ్ సినిమా అని చెబుతున్నారు. అయితే ఫ్యాన్స్ దానిని ఎంత‌ పెద్ద రేంజుకు తీసుకెళ‌తారు? అన్న‌దే స‌క్సెస్ రేంజును ప్ర‌భావితం చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.