ఆర్ఆర్ఆర్-సాహో వెంట ఆ ఒక్కడు?
RRR+SAHOO ఈ రెండు సినిమాల ఓవర్సీస్ రైట్స్ ని దుబాయ్ కి చెందిన ఫర్స్ ఫిలింస్ సంస్థ చేజిక్కించుకుందని ఇప్పటికే వార్తలొచ్చాయి. ఆర్ఆర్ఆర్ చిత్రం ఓవర్సీస్ కోసం 65 కోట్లు.. సాహో ఓవర్సీస్ హక్కుల కోసం 48కోట్లు కలుపుకుని ఫార్స్ సంస్థ మొత్తం 113 కోట్లు చెల్లించనుందని ఆ మేరకు బిగ్ డీల్ క్లోజ్ అయ్యిందని గతంలో వార్తలొచ్చాయి. ఒక్క చైనా మినహా అన్ని దేశాల్లో ఈ సినిమాల్ని ఫర్స్ ఫిలింస్ సంస్థ రిలీజ్ చేయనుందట. డివివి ఎంటర్ టైన్ మెంట్స్, యు.వి.క్రియేషన్స్ నుంచి లీకులు లేకపోయినా ట్రేడ్ లో ఆ మేరకు ముచ్చటా సాగింది.
బాహుబలి 2 చిత్రానికి ఓవర్సీస్ ఏకంగా 64 కోట్లు (చైనా మినహా) పలికింది. అంతకుమించి ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్ కి డిమాండ్ నెలకొనడంపై ఫిలింసర్కిల్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఆర్.ఆర్.ఆర్ ఓవర్సీస్ బిజినెస్ కి సంబంధించి ఫర్స్ సంస్థ ఈ వారంలో 30 కోట్ల మేర అడ్వాన్స్ చెల్లిస్తోందని తెలుస్తోంది. ఆ మేరకు ఫిలింనగర్ సర్కిల్స్ లో ఓ లీకు అందింది. ఆర్.ఆర్.ఆర్, సాహో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాలుగా పాపులరయ్యాయి. దాదాపు 250-300 కోట్ల మేర బడ్జెట్లు పెడుతున్నారన్న ప్రచారం ఉంది.