నితిన్ సినిమా నుంచి ఊహించని లుక్ తో “RRR” నటుడు.!

ఈ ఏడాది మొదటి ఆరు నెలలు కూడా మంచి సినిమాలు బాక్సాఫీస్ సక్సెస్ లు బాగానే వచ్చాయి. ఇక ఇక్కడ నుంచి కొన్ని సినిమాలు వచ్చాయి కానీ వాటిలో చాలా వరకు సక్సెస్ లేవు. దీనితో మంచి మాస్ సినిమా కోసం అంతా ఎదురు చూస్తుండగా వాటిలో రామ్ పోతినేని నటించిన “వారియర్” ఈరోజు రిలీజ్ అయ్యింది.

ఇక దీని తర్వాత మరో యంగ్ హీరో నితిన్ నటించిన క్రేజీ మాస్ చిత్రం “మాచర్ల నియోజకవర్గం” కూడా ఒకటి. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి అయితే చిత్ర బృందం RRR నటుడు సముద్రఖని చేస్తున్న షాకింగ్ రోల్ రాజప్ప పాత్ర లుక్ ని రిలీజ్ చేశారు.

ఇది మాత్రం ఊహించని లెవెల్ లో ఉందని చెప్పాల్సిందే. మాచర్ల నియోజకవర్గంలో ఉండే ఒక క్రూరమైన ఎమ్మెల్యే గా షాకింగ్ లుక్ లో అయితే తాను కనిపిస్తున్నాడు. అంతే కాకుండా రాజప్పకి ఎలెక్షన్స్ ఉండవ్ యూనానిమస్ ఎమ్మెల్యే అంటూ తన రోల్ ఎలా ఉంటుందో చెప్తున్నారు.

అలాగే ఫస్ట్ లుక్ చూస్తే ఇది నితిన్ ని కలిసే సీన్ లాగే అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా క్యాథరిన్ కీలక పాత్ర చేస్తుంది. అలాగే మహతి సాగర్ సంగీతం ఇస్తున్న ఈ సినిమా ఈ ఆగస్ట్ 12న విడుదల కాబోతుంది.