RRR లో రామ్ చరణ్ తండ్రిగా చేసే బాలీవుడ్ హీరో ఎవరంటే

RRR

RRR. ప్రస్తుతం పరిశ్రమ అంతా దీని గురించే చర్చ. ఉండదు మరి, బాహుబలి వంటి చారిత్రిక విజయం తరువాత దర్శకుడు రాజమౌళి చేసే సినిమాపై అందరి కళ్ళు ఉండడంలో తప్పేమీ లేదు కదా. సరే, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అలాగే ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్ఠీఆర్ చిన్న విరామం తీసుకుంటున్నారు షూటింగ్ నుండి.

ఇందులో అలియా భట్ కూడా ఉందని సమాచారం. ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే ఇందులో హీరో రామ్ చరణ్ కు తండ్రిగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ చేస్తున్నారట. తన పాత్ర చాలా కీలకమైన పాత్ర అనీ అడిగిన వెంటనే సంతకం చేసేసారట అజయ్. ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30 న విడుదల అవుతుంది.