స్టేజ్ మీదే అలా బెదిరించేస్తోందిగా.. రోజా జబర్దస్తీ మామూలుగా లేదు

Roja satires on Shanthi Swaroop In Jabardasth

జబర్దస్త్ షోలో ఇప్పుడు రాజ్యం మొత్తం రోజా చేతుల్లోనే ఉంది. ఒకప్పుడు నాగబాబు, రోజాలు కలిసి ఆధిపత్యం చెలాయించేది. అందులో ఎక్కువగా నాగబాబే జబర్దస్త్ వ్యవహారాలను చూసుకునేది. నాగబాబు, రోజాలు ఇద్దరూ జడ్జ్‌లుగా ఉన్న సమయంలో అక్కడ ఎక్కువగా మెగా భజనే నడిచేది. నాగబాబు వెళ్లిపోయాక మొత్తంగా రోజా చేతిలోకి వెళ్లింది. టీం లీడర్లు, కంటెస్టెంట్లందరూ కూడా రోజాను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

Roja satires on Shanthi Swaroop In Jabardasth
Roja satires on Shanthi Swaroop In Jabardasth

రోజా చెప్పిందే వేదమన్నట్టుగా మారింది. టీం లీడర్లు సైతం రోజాను మోసేందుకు పంచ్‌లు, స్కిట్లు రాసేశారు. తమ స్కిట్లలోనూ రోజా ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకునేవారు. అందుకే ఈ మధ్య స్కిట్లలో రోజానే పంచ్‌లు సెటైర్లు వేస్తోంది. అలా మొత్తానికి రోజా జబర్దస్త్‌ను తన ఆధిపత్యంలోకి తెచ్చుకుంది. తనపై ఎవరైనా పంచ్‌లు వేస్తే తాటతీసేలానే ఉంది. తాజాగా ఓ స్కిట్‌లోనూ ఇలాంటి ఓ పంచ్‌నే వేసింది.

ఆది స్కిట్‌లో ఈసారి రాజా సినిమాను స్ఫూప్ చేశారు. అందులో సౌందర్య పాత్రను రోజా వేయగా.. వై విజయ క్యారెక్టర్ శాంతి స్వరూప్ వేశాడు. అయితే క్యారెక్టర్ ప్రకారం రోజా మీద శాంతి స్వరూప్ పంచ్ వేయాలి. కానీ రోజా మాత్రం ఓ చూపు చూసి బెదిరించింది. నీ ఫ్యూచర్ ఏంటో ఆలోచించుకో అంటూ చేతులతో సైగలు చేస్తూ శాంతి స్వరూప్‌ను రోజా బెదిరించేసింది. దెబ్బకు శాంతి స్వరూప్ రోజా ముందు మోకరిల్లేంత పని చేశాడు. మొత్తానికి అది స్కిట్ అయినా కూడా లోపల పరిస్థితి మాత్రం అలానే ఉంటుందనిపిస్తోంది.