జబర్దస్త్ షోలో వేసే స్కిట్స్, వారి డబుల్ మీనింగ్ డైలాగ్స్ గురించి అందరికీ తెలిసిందే. ఒకానొక దశలో అడల్డ్ కామెడీ, కంటెంట్ ఉందని లెక్కలేనన్ని విమర్శలను ఎదుర్కొంది. మధ్యలో కాస్త తగ్గినట్టు కనిపించినా.. టీం లీడర్స్, కంటెస్టెంట్లు మాత్రం వాటికే అలవాటైనట్టు కనిపిస్తోంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్, సంసారాలను కూల్చే స్కిట్స్, అమ్మాయిలపై మోజు వంటి స్కిట్స్ చేస్తూ టీఆర్పీ రేటింగ్స్ పెంచుకుంటూ ఉంటున్నారు.
ఇక అందులో హైపర్ ఆది వేసే డబుల్ మీనింగ్ డైలాగ్స్, సుధీర్ అమ్మాయిలపై వేసే స్కిట్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సుధీర్ తనకు అమ్మాయిల పిచ్చి ఉందనేట్టుగా ప్రొజెక్ట్ చేసే స్కిట్స్ ఎక్కువగా వేస్తుంటారు. అలాంటి వాటిని అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు కూడా. వాటినే ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్‌గా ఫీలవుతున్నారు. తాజాగా ఓ స్కిట్‌లో సుధీర్ అత్యుత్సాహం, ఆత్రుతను రోజా పసిగట్టి కౌంటర్ వేసింది.
వచ్చే వారానికి సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. బుల్లెట్ భాస్కర్ స్కిట్‌లో సుధీర్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చినట్టున్నాడు. బుల్లెట్ భాస్కర్ పోలీసాఫీసర్ పాత్రలో నటించగా స్కిట్‌లో భాగంగా సుధీర్ అమ్మాయి (సునామీ సుధాకర్)ను లేపుకొని రావడం, రూం కావాలి అంటూ పోలీస్ స్టేషన్‌లోకి రావడం, సెల్‌లోనూ దిండు, దుప్పటి కావాలి అనేట్టు ఫేస్ పెట్టడం, సర్ పూలు, పాలు, హల్వా లాంటివి అని పూర్తి చేయబోతోండగానే.. సిగ్గులేని జన్మ అంటూ రోజా కౌంటర్ వేసింది. అయితే బయట జనం కూడా సుధీర్‌కు నిజంగానే అలాంటి ఆత్రమే ఉంటుందా? అనే అనుమానం కలగక మానదు.