బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మృతి వెనుక సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఆత్మహత్య అని చిత్రించినా .. దానిని అభిమానులు.. శ్రేయోభిలాషులు నమ్మడం లేదు. చాలా మంది ఇంకా షాక్ నుంచి కోలుకోనే లేదు. ఇప్పటివరకు కెరీర్ పరంగా బెస్ట్ గా ఉన్న సదరు యువహీరో ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడడాన్ని ఎవరూ నమ్మడం లేదు.
సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ముంబై పోలీసులు ఉదహరించిన కారణాలు లాజికల్ గా లేవు. డిప్రెషన్ ప్రిస్క్రిప్షన్లను అతడి రూమ్ కనుగొన్నామని పోలీసులు చెబుతున్నా ఇదే నిజమా? అన్నది క్లారిటీగా లేదు. ఇంకా ఎన్నో సందేహాలున్నాయంటూ అభిమానులు సీబీఐ దర్యాప్తును కోరుతున్నారు. అయితే పోలీసులు ఈ కేసులో సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ ని సాగిస్తున్నారా? అన్న సందేహాలు కలగక మానడం లేదు.
సుశాంత్ సింగ్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మాటల్ని గతంలో పోలీసులు రికార్డ్ చేశారు. అతన్ని ఒంటరిగా వదిలేయడానికి ఆమె చెప్పిన కారణాలన్నింటినీ పోలీసులు రికార్డ్ చేశారు. కానీ లేటెస్టుగా పోలీసులు సుశాంత్ డబ్బు ఖర్చు చేసన విధానంపై ఆరాలు తీస్తున్నారు. రకరకాల సందేహాలతో రియా యాక్టివిటీస్ ని పోలీసులు సీక్రెట్ గా వాచ్ చేస్తున్నారట. ఇక రియా సోదరుడితో కలిసి సుశాంత్ ఓ కంపెనీని ప్రారంభించిన నేపథ్యంలో ఆ కోణంలోనూ పోలీసులు ఆరాలు తీసిన సంగతి విధితమే.
ఇప్పటివరకు 35 మంది తమ స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ఇందులో సుశాంత్ వంటమనిషి .. అతని సోదరి స్టేట్ మెంట్ ను ఇంతకుముందు రికార్డ్ చేసినదే కాకుండా ఇప్పుడు మరోసారి రికార్డ్ చేయాలనుకుంటున్నారు. సీబీఐ దర్యాప్తు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నందున ముంబై పోలీసులు ఈ కేసును ఎంతవరకు సీరియస్ గా తీసుకున్నారు? అన్నది చూడాలి.