హీరోగారి ఉరి వెనక అంత కథ ఉందా?
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనక మిస్టరీని తేల్చే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. ఆ క్రమంలోనే రకరకాల కారణాలు ప్రచారం అవుతున్నాయి. అయితే వాటిలో ఏది నిజం? ఏది అబద్ధం అన్నది తేల్చాల్సింది పోలీసులే.
తాజా సమాచారం ప్రకారం.. త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నాడంటూ సాగుతున్న ప్రచారంలో నిజం లేదని అర్థమవుతోంది. అసలు సుశాంత్ రియా చక్రవర్తిని పెళ్లాడే ఆలోచనలో ఉన్నాడా లేదా? అన్నది అటుంచితే.. అసలు సూసైడ్ కి ముందు చాలా కాలంగా రియాతో సుశాంత్ మాట్లాడడం లేదని తెలిసింది. అందుకు కారణమేమిటి? అన్నది ఆరా తీస్తే.. సుశాంత్ ఓ నటిని సీరియస్ గా ప్రేమించాడట. తనతో అనూహ్యంగా ప్రేమ బ్రేకప్ అయ్యింది. ఆమె నిశ్చితార్థం చేసుకున్న రెండు రోజులకు తీవ్ర డిప్రెషన్ లో సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అసలు కారణం ఇదేనంటూ సోషల్ మీడియాల్లో ప్రచారం సాగుతోంది.
దీంతో పాటు సుశాంత్ పీఏ దిశా సాలియా ఆత్మహత్య కూడా ఒక కారణమేనని విశ్లేషిస్తున్నారు. వరుస ఇన్సిడెంట్లు కారణమని చెబుతున్నారు. దిశ సాలియా తాను పెళ్లాడబోతున్న యువకుడితో గొడవ పడుతోంది. ఆ ఇద్దరినీ కలిపేందుకు సుశాంత్ ప్రయత్నించాడు. ఈలోగానే దిశ ఆత్మహత్యకు పాల్పడింది. ఇది సుశాంత్ ని తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంలో నిజం ఎంత? అన్నది పోలీసులే తేల్చాల్సి ఉంది.
https://twitter.com/ImagesmithsPR/status/792644102466699264/photo/1