Crime News: ప్రేమ మత్తులో పడి యువతకు కళ్ళు మూసుకుపోయాయి వయసులో ప్రేమకు ఆకర్షణ కు మధ్య తేడా తెలియక చాలామంది అమ్మాయిలు మోసపోతున్నారు. ప్రేమించిన వారి కోసం ఇంటి నుండి పారిపోయి తల్లిదండ్రులను బాధ పెట్టే వారు కొందరైతే.. ప్రేమ పేరుతో మోసపోయిన ఆత్మహత్యలు చేసుకున్నవారు ఎందరో. కానీ కానీ కొంతమంది యువతులు మాత్రం ప్రేమించిన వారు మోసం చేశారని ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంగా వారితో పోరాడుతున్నారు. ఇటీవల కాలంలో అచ్చం ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే.. ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు యువతి నిరసనకు దిగింది.రేణిగుంటకు చెందిన చందన అనే యువతి, నిమ్మనపల్లె మండలానికి చెందిన కేధార్ నాథ్ కు చెన్నై నగరంలోని తాంబరంలో పరిచయం ఏర్పడింది. గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం ఇంట్లో పెద్దలకి చెప్పి వారి అంగీకారంతో పోయిన నెల 21వ తేదీన పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించారు.
అంతా సాఫీగా జరుగుతుంది అనుకున్న సమయంలో పెళ్లికి రెండు రోజుల ముందు పెళ్ళికొడుకు ఇంటి నుండి పారిపోయాడు. పెళ్లి కాకముందే డబ్బు బంగారం అన్ని తీసుకొని కేదార్నాథ్ పెళ్లికి రెండు రోజుల ముందు సెల్ ఫోన్ స్విచాఫ్ చేసి ఇంటి నుండి పరారయ్యాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు తాము మోసపోయామని గ్రహించి కేదార్నాథ్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన యువతి నిన్న ప్రియుడి ఇంటి ముందు తల్లిదండ్రులతో కలిసి నిరసనకు దిగింది. ప్రస్తుతం అతని కుటుంబ సభ్యులు అందరూ ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నారు.