బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసు ఇంకా ఎన్నో మలుపులు తిరుగుతోంది. ముందు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అన్నారు. ఆ తర్వాత ఆయనది ఆత్మహత్య కాదు హత్య అన్నారు. ఆయన ప్రేయసి రియా చక్రవర్తే కావాలని సుశాంత్ ను చంపించిందని ఆరోపిస్తున్నారు. మొత్తానికి అసలు సుశాంత్ ది హత్యా? ఆత్మహత్యా? అనేది తేల్చడం కోసం ఏకంగా సీబీఐ అధికారులే రంగంలోకి దిగారు.
సీబీఐ అధికారులు సుశాంత్ కేసును శరవేగంగా హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ ఇంటికి వెళ్లి ఆయన చనిపోయిన సీన్ ను రీక్రియేట్ చేశారు. సీబీఐకి చెందిన ఫోరెన్సిక్ అధికారులు సీన్ రిక్రేయేషన్ ఈవెంట్ ను రికార్డు చేశారు.
ముంబైలోని బాంద్రాలో ఉన్న సుశాంత్ ఇంటికి సీబీఐ అధికారులు సుశాంత్ స్టాఫ్ ను, అతడి ఫ్రెండ్ ను తీసుకొని వెళ్లారు.
ఇదిలా ఉండగా… సుశాంత్ కేసు విషయంలో రియా చక్రవర్తి, ఆమె లాయర్లు.. ఏకంగా సీబీఐకే ట్విస్టు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సీబీఐ ఇప్పటి వరకు రియాను విచారించలేదని రియా తరుపు లాయర్లు చెబుతున్నారు.
రియాను విచారించడానికి సీబీఐకి ఎటువంటి అభ్యంతరాలు లేవని.. సీబీఐ అధికారులు ఎప్పుడు పిలిస్తే.. రియా అప్పుడు వెళ్తుందంటూ చెబుతున్నారు. రియాకు ఇప్పటి వరకు సీబీఐ నుంచి సమన్లు అందలేదంటూ చెబుతున్నారు.
నిజానికి.. సీబీఐ అధికారులు మొదటగా రియానే విచారిస్తారని అంతా అనుకున్నారు. అయితే సుశాంత్ ఇంట్లో సీన్ ను రీక్రియేట్ చేశారు. ఇక.. ఆ తర్వాత ఖచ్చితంగా రియానే సీబీఐ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రియాను ఈడీ అధికారులు కూడా విచారించారు. ఆమె కాల్ డేటాను విశ్లేషించారు.