వర్మ ఈ వీడియో ఏంటి..ఇంత దిగజారుడా?

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ట్రైలర్ ఈ రోజు ( డిసెంబర్ 21న) రిలీజ్ అవుతూంటే.. వర్మ తాను కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ లోని వెన్నుపోటు సాంగ్ ని రిలీజ్ చేస్తానని ప్రకటించారు. దాంతో వర్మ కావాలని ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ కు కౌంటర్ ఇవ్వటానికి వెన్నుపోటు పాటను విడుదల చేస్తున్నాడని జనాలకి అర్దమైపోయింది. అయితే తన వెన్నుపోటు సాంగ్ కు కాస్తంత పబ్లిసిటీ కావాలనకున్నాడేమో ..బాలకృష్ణ వాయిస్ మార్ఫింగ్ చేసిన వీడియోని ఒకటి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

ఆ వీడియో పోస్ట్ చేస్తూ…తను దాన్ని తయారు చేయలేదంటూ వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేసారు. అయితే ఆ వీడియో చూసిన ఎవరికైనా అది వర్మ చీప్ టెక్నిక్ అని అర్దమైపోతుంది.

ఎందుకంటే క్లియర్ గా అర్దమైపోతోంది వెన్నుపోటు సాంగ్ కు పబ్లిసిటీ చేస్తూ ఆ వీడియో వచ్చింది. అలాగే వర్మ వాయిస్ యాజటీజ్ ఉంది. అంతేకాకుండా వర్మ రాసిన స్క్రిప్ట్ అది అని కూడా తెలిసిపోతోంది. ఈ వీడియోతో ఆయన నందమూరి అభిమానులను రెచ్చ గొట్టాలనుకుంటున్నారో లేక..బాలయ్యని కెలకాలనుకుంటున్నారో అర్దం కావటం లేదు. ఏదైమైనా ఇలాంటి వీడియోలు అంత గొప్ప దర్శకుడు నుంచి ఆశించం..ఊహించం.

ఇక లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం విషయానికి వస్తే… ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు వర్మ. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో వెన్నుపోటు పాటకు ప్రత్యేకంగా ఫస్ట్‌లుక్‌ను డిసెంబర్‌ 21 సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు వర్మ.