‘పెళ్లి చూపులు’ హీరోయిన్ కి ఫలించిన ఎదురు చూపులు

ఎదురు చూపులు ఫలిస్తే.. ఎంత ఆనందంగా ఉంటుందో అందాలతార రీతూవర్మను అడగాలి. ఎందుకంటే ఆమెకు దుల్కర్ సల్మాన్‌తో సినిమా పడింది. ‘పెళ్లిచూపులు’లో ఆకట్టుకున్న ముగ్దమనోహరి.. తరువాత చేసిన తెలుగు సినిమాలతో మెప్పించలేకపోయింది. దీంతో మలయాళంపై దృష్టి పెట్టి -‘కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్’ ప్రాజెక్టులో దుల్కర్ సరసన చాన్స్ కొట్టేసిందట. నటనలో మమ్ముట్టి (తండ్రి)ని మించిన మలయాళ హీరోగా పేరు తెచ్చుకున్న దుల్కర్‌తో జోడీ అంటే రీతూకి వన్ ప్లస్ వన్ ఆఫర్ దక్కినట్టే.

అందుకే సినిమా విడుదలకు ముందే క్యూటీ గుమ్మంలో అవకాశాలు క్యూకట్టాయట.ఈ విషయం గురించే రీతూవర్మను కదిలిస్తే.. ఇప్పుడు నా ఆలోచనకు తగ్గట్టు అవకాశాలు వస్తున్నాయి. టాలీవుడ్ తో పాటు మలయాళంపై దృష్టి పెట్టి సినిమాలను అంగీకరిస్తున్నాను. ఈ విషయంలో నా దర్శక,నిర్మాతలకు నేనెంతో రుణపడి ఉన్నాను అని చెప్పుకొచ్చింది.