ఇండస్ట్రీ టాక్ : పాపం “లైగర్” లో మైక్ టైసన్ కి రికార్డు లెవెల్లో చదివించారట.!

తెలుగులో ఈ ఏడాది భారీ లాసులు మిగిల్చిన లేటెస్ట్ చిత్రాల్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ అలాగే బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “లైగర్” దెబ్బ కూడా ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు.

దీనితో దర్శకుడు పూరీ జగన్నాద్ కి కూడా భారీ దెబ్బ పడింది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో పాటు ఏకంగా హాలీవుడ్ బాక్సింగ్ సెన్సేషన్ మైక్ టైసన్ ని కూడా దింపడంతో సినిమాపై భారీ హైప్ సెట్టయ్యింది. ఇక దీనితో అయితే ఈ సినిమా రిలీజ్ కూడా చాలా గ్రాండ్ మ్యానర్ లోకి వెళ్లగా..

దర్శకుడు వేసిన దెబ్బకి లైగర్ డిజాస్టర్ అయ్యి కూర్చుకుంది. అయితే ఈ సినిమాకి వచ్చిన లాసులు ఏమో కానీ ఇప్పుడు మైక్ టైసన్ కి చిత్ర నిర్మాతలు చదివించుకున్న మొత్తం సినీ వర్గాల్లో షాకింగ్ గా మారింది.

ఈ చిత్రం కోసం మైక్ టైసన్ కి గాను భారీ మొత్తంలో 20 కోట్లకి పైగానే పారితోషకం ఇచ్చి చేయించుకున్నారట. కానీ తీరా చూస్తే ఈ మొత్తం కూడా లాసే అని చెప్పాలి. మొత్తానికి అయితే ఇప్పుడు సినిమా ఎలాగో ఎత్తేస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగానే నష్టం అని ట్రేడ్ పండితులు భేరీజు వేస్తున్నారు.