మొదటి భార్య పై  రవితేజ ప్రతీకారం !  

సినిమా ప్రపంచంలో మనకు అన్ని ఉన్నా..  అదృష్టం అనే ఒక్క ఐటమ్ లేకపోతే మాత్రం.. ఏ శక్తి మనల్ని స్టార్ లను చెయ్యలేదు. అద్భుతమైన టాలెంట్ ఉన్నా.. కనీస హిట్ కూడా లేనప్పుడు ఇక మనకు అవకాశాలు రావనేది సినీ ప్రపంచంలో బేసిక్ రూల్.  అయినా, కొంతమందిని చూస్తే  ఈ మాట నిజమేనేమో అనిపిస్తోంది. ఆ  కొంతమందిలోని వ్యక్తే  బబ్లీ బ్యూటీ  ‘వరలక్ష్మీ శరత్‌కుమార్‌’.  ఏకంగా  ఒక హీరోకి కూతురు. ఆ విషయం పక్కన పెడితే..  హీరోయిన్ కు ఉండాల్సిన క్యాలిటీస్ అన్ని ఉన్నా  ఎందుకో హీరోయిన్ గా మాత్రం సెటిల్ కాలేకపోయింది.  అసలు మొత్తం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి బలమైన  సపోర్ట్ ఉన్నా..  ఇన్నాళ్లూ ఎక్కువుగా చిన్న చిత్రాలకు, సేడ్ క్యారెక్టర్స్ లోనే కొట్టుమిట్టాడతా ఉంది.  

ఏమైనా ఇది  వరలక్ష్మి విషయంలో తీవ్ర అన్యాయమే.  పోనీ ఆ సినిమాలైనా  ఆ క్యారెక్టర్స్ అయినా,  ప్రాముఖ్యత ఉన్నవా అంటే.. ఎదో చిన్నాచితకా  చిత్రాల్లో ఏదో కాసేపు  కనిపించే పక్కా ఆవేశపూరిత పాత్రలు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో  వరలక్ష్మికి   మాస్‌ మహారాజా సినిమా క్రాక్ లో చెప్పుకోతగ్గ అవకాశం వచ్చింది. ర‌వితేజ –  గోపీచంద్ మ‌లినేని కలయికలో  హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో  రవితేజ సరసన మెయిన్ హీరోయిన్ గా శ్రుతి హాసన్  నటిస్తోంది. అయితే  వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా రవితేజ సరసన మరో హీరోయిన్ గా ఆడిపాడనుంది.  సినిమాలో ఆమె రవితేజ మొదటి భార్య అట. కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోవడంతో మొదలైన వైర్యం  తన భర్త రెండో భార్యను చంపే వరకూ వెళ్తుందని తెలుస్తోంది.  

రెండో భార్య పాత్రలో శ్రుతి హాసన్ నటిస్తోంది. శ్రుతి పాత్రకు  వరలక్ష్మీ పాత్ర కూడా దీటుగా ఉంటుందని  కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో వరలక్ష్మి పాత్రనే హైలెట్ అవ్వబోతుందట. మొత్తానికి లేడీ  రౌడీ పాత్రలకే పరిమితం అవుతూ వస్తోన్న వరలక్ష్మికి  కనీసం హీరో భార్య పాత్ర అయినా దక్కిందిలే. ఇక ఈ సినిమాలో ర‌వితేజ ఇద్దరి భార్యల భర్తగా నటించనున్నాడు.  బి.మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  మరి  ‘వరలక్ష్మీ శరత్‌కుమార్‌’  ఈ చిత్రంతోనైనా స్టార్  హీరోయిన్ గా బ్రేక్ సాధించాలని ఆశిద్దాం.