మేకింగ్ వీడియోలో ఆ లక్షణాలు కనపడుతున్నాయి

బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ డిజాస్టర్ల తరువాత రవితేజ, అలాగే హ్యాట్రిక్ డిజాస్టర్స్ తరువాత దర్శకుడు శ్రీనువైట్ల ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో అందిస్తున్న సినిమా అమర్, అక్బర్, ఆంధోని. ఇలియానా హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ ఈ నెల 16వ తేదిన ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకురానుంది.

ఈ నేప‌థ్యంలో ఈ మూవీ మేకింగ్ వీడియోని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది..మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. తాజాగా విడుద‌లైన ఈ మూవీ మేకింగ్ వీడియోని మీరూ చూడండి.. ఈ మేకింగ్ వీడియో చూసిన వారంతా సినిమా మంచి హిట్ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు.

Amar Akbar Anthony Making | Ravi Teja | Ileana | Thaman S | Sreenu Vaitla | Mythri Movie Makers

ఇక ఈ చిత్రంలో అమర్, అక్బర్, ఆంథోనీగా మూడు షేడ్స్ లో హీరో కనిపిస్తాడని ఇఫ్పటికే వార్తలు బయటకు వచ్చాయి. అదే విషయాన్ని పక్కా చేస్తూ, ట్రైలర్ వదిలారు. శ్రీనువైట్ల తన పాత ధోరణిలోకి వెళ్లి పూర్తి కామెడితో… డిఫరెంట్ జోనర్ లో కథ అల్లుకుని చేస్తున్న సినిమా ఇదని ప్రచారం జరుగుతోంది. సవ్యసాచి నిరాశపరిచినా ఈ సినిమా మీద పూర్తి నమ్మకంతో వున్నారు నిర్మాతలు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.