రవిబాబు ఆశలు ‘ఆవిరి’ అవ్వనివ్వదుగా

రవిబాబు నుంచి మరో సినిమా వస్తోంది .. ఆ సినిమా పేరే ‘ఆవిరి’. మళ్లీ తనకు కలిసి వచ్చిన దెయ్యం జోనర్ లోనే మరో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు.ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు.

తనని తాను మరిచిపోయి నాట్యం చేస్తోన్న ఓ యువతిని గాజు సీసాలో ఒక రాక్షసుడు బంధిస్తునట్టుగా ఈ పోస్టర్లో చూపించారు. పోస్టర్ ను బట్టి ఇది సస్పెన్స్ తో కూడుకున్న హారర్ థ్రిల్లర్ అని అర్దమవుతోంది. గతంలో ‘అవును’ సినిమాతో మెప్పించిన రవిబాబు, మరోమారు ప్రేక్షకులను భయపెట్టడానికి వచ్చేస్తున్నాడన్న మాట.

అనసూయ, అవును.. అవును 2 ఇలా ‘అ’ అక్షరం సెంటిమెంట్ తో సినిమాలు చేస్తూ వస్తున్న రవిబాబు కు ఈ సినిమా కీలకం. రెండు,మూడేళ్ల పాటు తీసిన ‘అదిగో’ సినిమా డిజాస్టర్ అవటంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. సక్సెస్ కోసం చూస్తున్న రవిబాబు ఆశలు ఆవిరి కాకుండా నిలబెడుతుందేమో చూడాలి.