ఆత్మల కథల్ని.. హారర్ కథాంశాల్ని ఎంత వైవిధ్యంగా, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చూపిస్తే అంత సక్సెస్ రేట్ ఉంటుంది. తెరపై బొమ్మ పడినప్పటి నుంచి ఎండ్ కార్డ్ పడే వరకూ ఆడియన్ ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టగలగాలి. లేదంటే దెయ్యం కాన్సెప్ట్ లతో సినిమాలు సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. రవి బాబు గతంలో `అవును` చిత్రాన్ని నవ్య పంథాలో తీసి సక్సెస్ అందుకున్నాడు. అటుపై హిప్నాటిజం కాన్సెప్ట్ తీసుకుని `అమరావతి`తో మరో సక్సెస్ అందుకున్నాడు. తర్వాత చేసిన `అవును-2` ప్రయ్నతం బెడిసి కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తానే స్వీయా దర్శకత్వంలో `ఆవిరి` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈసారి రవిబాబు పాత మిత్రుడు సురేష్ బాబు నుంచి దూరంగా వచ్చి దిల్ రాజు కాంపౌండ్ లో ఈ చిత్రం తీశారు.
ఇటీవలే టీజర్ రిలీజ్ చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచాడు. కానీ తాజాగా ట్రైలర్ లో మాత్రం ఆ క్యూరియాసిటీ మిస్ అయింది. షాట్స్ అన్నీ పరమ రొటీన్ గానే ఉన్నాయి. ట్రైలర్ ను బట్టి సినిమా అంతా ఓ పాప చుట్టూ ఆత్మ తిరుగుతుందని సన్నివేశాలు చెబుతున్నాయి. పాపను ఆత్మ ఆవహిస్తే ఎం జరిగిందన్నదే కథ.. పాపతో ఆటలాడుతుంది.. ఆడిస్తుంది చాలా చేస్తోంది ఆ ఆత్మ. తనకు నచ్చని వాళ్లపైకి ప్లేట్లు వగైరా విసిరేస్తోంది. స్కూటీలు నడిపించేస్తోంది. అయితే ఈ కథ చుట్టూ క్రైమ్ డిపార్ట్ మెంట్, ఓ చైల్డ్ సైక్రియాటిస్ట్, తల్లిదండ్రుల మనో వేదనను ట్రైలర్ లో హైలైట్ చేసారు. కెమెరా వర్క్ బాగుంది. రవి బాబు అవును లానే దెయ్యాన్ని రివీల్ చేయకుండా కేవలం కెమెరా జిమ్మిక్ తోనే సినిమాని నడిపే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. మరి రవి బాబు ప్రయత్నం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి. నవంబర్ 1న సినిమా రిలీజ్ కానుంది. ఇందులో నేహా చౌహాన్, రవిబాబు కిడ్ మున్ని తల్లిదండ్రులుగా నటిస్తున్నారు.