భిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రవిబాబు.. నుంచి ఎవ్వరూ ఊహించని చిత్రమొకటి వచ్చింది. ఇప్పటి వరకు కామెడీ, లవ్, థ్రిల్లర్, క్రైమ్ ఇలా ప్రతీ ఒక్క జానర్ ట్రై చేసి హిట్ కొట్టిన రవిబాబు ఈ కరోనా లాంటి కష్టకాలంలో అడల్డ్ కంటెంట్‌తో వచ్చాడు. ఈ ‘క్రష్’ టీజర్ చూస్తే రవిబాబు మరీ ఇంత దిగజారాలా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ముగ్గురు యువకులు, వారి క్రష్, లవ్, కామ కథలను చెప్పడం, హీటెక్కించే సీన్లతో టీజర్ వైరల్ అవుతోంది.
టిఫిన్లు కానిచ్చాను, పైపైనే, టంగ్ మని లేచింది.. ఇలా చెప్పలేనన్ని డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో టీజర్ నిండిపోయింది. ఇక డైలాగ్‌ల సంగతి పక్కనబెడితే.. రొమాంటిక్ సీన్లకు కొదువే లేదు. ఒక్కొక్కరు రెచ్చిపోయి మరీ నటించారు. దెబ్బకు టీజర్ మాత్రం ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలు ఉన్న ఈ కరోనా సమయంలోనూ ఇంత ఘాటుగా రెచ్చగొట్టేలా సీన్లు తీశాడంటే రవిబాబు మామూలోడు కాదు.
అసలే ఈ మధ్య వరుస ఫ్లాపులో ఉన్న రవిబాబు.. రూటు మార్చి అడల్డ్ కంటెంట్‌తో హిట్టు కొట్టాలనే ధృడ సంకల్పంతో ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ఈ యూత అండ్ అడల్ట్ చిత్రం క్రష్ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. పోస్టర్లతో ఓ రేంజ్ అంచనాలు పుట్టించగా.. తాజాగా టీజర్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.