సినీ నటుడు చలపతిరావు హఠాన్మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని విషాదం అని చెప్పాలి. నటుడు కైకాల సత్యనారాయణ మరణ వార్త నుంచి ఇంకా బయటపడక ముందే చలపతిరావు మరణించడం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.ఇక నటుడు చలపతిరావు దాదాపు ఐదున్నర దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగారు. ఈయన నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకొని జూనియర్ ఎన్టీఆర్ వరకు ఇలా మూడు తరాల హీరోల సినిమాలలో నటించి సందడి చేశారు.
అయితే గత కొంతకాలంగా చలపతిరావు అనారోగ్య సమస్యల కారణంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కృష్ణ నటించిన గూడచారి 116 సినిమా ద్వారా వెండితెర ఎంట్రీ ఇచ్చినటువంటి ఈయన సుమారు 1200 లకు పైగా సినిమాలలో నటించి మెప్పించారు. ఇలా వందల సినిమాలలో నటించిన చలపతిరావు తన కుమారుడు రవి బాబును కూడా ఇండస్ట్రీకి దర్శకుడిగా నటుడిగా పరిచయం చేశారు.ఇద్దరు కుమార్తెలు కాగా వారిద్దరు కూడా అమెరికాలో స్థిరపడ్డారని ఈయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ఇక ప్రస్తుతం చలపతిరావు తన కుమారుడు రవిబాబు వద్ద నివసిస్తున్నారు అయితే తాజాగా ఈయన గుండెపోటుతో ఆకస్మిక మరణం పొందారు.ఇలా చలపతిరావు మరణించడంతో ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు ఈయన మృతికి సంతాపం తెలియజేస్తూ ఆయనతో వారికి ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు.ఇక ఇన్ని సంవత్సరాలపాటు ఇండస్ట్రీకి సేవలు చేసినటువంటి చలపతిరావు పెద్దగా ఆస్తులు ఏమి కూడబెట్టలేదని తెలుస్తుంది. ఈయన ఆస్తులు విలువ కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమేనని తెలిసినటువంటి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.