మన హీరోల బిరుదులు భలే కామెడీగా ఉంటాయి. అలాంటి బిరుదులో ఒకటి ‘మాస్ మహారాజా’. నలభై ఏళ్లకు హీరోగా సెటిల్ అయిన రవితేజ సాధించిన బిరుదు ఇది. అయితే మాస్ లో ఆయన ఏ రేంజ్ మహారాజో గాని, ప్రస్తుతం ఆయన అటు మాస్ కాకుండా ఇటు క్లాస్ కాకుండా మిగిలిపోయాడు. ఏ సినిమా చేసినా బకెట్ తన్నేస్తోంది. దీనికి తోడు పెరిగిన వయసు.. పదేళ్ల క్రితమే ముడతల ప్రభావం.. పైగా ఎవరితో సినిమా చేయాలో ఎలాంటి కథకు జెండా ఊపాలో ఏమి అర్ధం కాని స్థితిలో ఉండిపోయాడట మన మాస్ మహారాజా.
ఎంత కవర్ చేసినా వయసు కనిపిస్తుంది, లేకపోతె రూట్ మార్చి వయసుకు తగ్గ పాత్రలు చేస్తే.. ఉన్న మార్కెట్ పోతుందేమోనని పెద్ద డౌట్. అన్నిటికి మించి రవితేజ మీద కామెడీ పండినంతగా కొత్త తరహా కథలు పండవనేది ‘నా ఆటోగ్రాఫ్’ టైంలోనే ముద్ర పడిపాయే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన క్రాక్ చూపించకపోతే.. ఇక రవితేజకు ఆ క్రాక్ కూడా మిగలదు.
అన్నట్టు రమేష్ వర్మ అనే రిమేక్ ల దర్శకుడి దర్శకత్వంలోనూ ఒక సినిమా చేయడానికి రవితేజ ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో రవితేజ డబల్ యాక్షన్ చేయాలట. ఒక్క రవితేజనే చూస్తారో లేదో అంటే మళ్ళీ ఇద్దరు రవితేజలు ఎందుకంటే… డైరెక్టర్ వినే పొజిషన్ లో లేడట. మరి రవితేజ డైరెక్టర్ చెప్పింది చేస్తాడో లేక తన పరిస్థితిని వివరించి తప్పుకుంటాడో చూడాలి. మహా సముద్రం సినిమా నుండి ఇలాగే తప్పుకున్నాడు పాపం. ఇక రమేష్ వర్మతో చేస్తోన్న సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్స్.. వాళ్ళల్లో ఒకరు నిధి అగర్వాల్. మరో హీరోయిన్ గా నభా నటేష్ ను అనుకుంటున్నారు.
ఇక్కడ రవితేజకు మళ్ళీ మరో సమస్య. తన పక్కన నభా నటేష్ సరిగ్గా సెట్ అవ్వదు.. గతంలో చేసిన సినిమాలోనే ఆ అమ్మాయి సెట్ అవ్వలేదు అని రవితేజ ఎంత చెబుతున్నా దర్శకనిర్మాతలు వినట్లేదట. అది నిజమే. నిధి అగర్వాల్ అంటే ఏదో భారీ కాయం.. రవితేజకు సమానంగా కనిపిస్తోంది. కానీ, నభా ఫిజిక్ కూడా అంతంత మాత్రం. మరి నభాను పక్కకి తప్పిస్తారో లేక రవితేజనే ఒప్పిస్తారో చూడాలి. మొత్తానికి హిట్ లో లేకపోతే రవితేజ కూడా మాములు తేజలానే అయిపోయాడు. కొంతమంది నిర్మాతలు కూడా రెమ్యునిరేషన్ ను తగ్గించుకోమని డైరెక్ట్ గానే డిమాండ్ చేస్తున్నారట. ఏది ఏమైనా హిట్ లేని రవితేజం బాధ వర్ణాతీతం.