మాస్ మ‌హారాజా వార‌సుడు హీరో అయ్యేదెపుడు?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఫ్యామిలీ ఎఫైర్స్ గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసేది త‌క్కువే. ఆయ‌న కుమారుడు మ‌హాధ‌న్ కానీ కుమార్తె మోక్ష‌ద భూప‌తి రాజా కానీ ఏనాడూ ప‌బ్బుకో పార్టీకో వెళ్లార‌న్న వార్త ఏనాడూ విన్న‌ది లేదు. ర‌వితేజ భార్య కుటుంబ స‌భ్యులు అప్ప‌ట్లో రాజా ది గ్రేట్ ఆడియో ఈవెంట్లో క‌నిపించారు. అలా రేర్ గా మాత్ర‌మే ఈవెంట్ల‌లో క‌నిపిస్తుంటారు. అది కూడా ర‌వితేజ న‌టించిన వాటివ‌ర‌కూ.

అయితే ర‌వితేజ కుమారుడు .. కుమార్తె ఇప్పుడెలా ఉన్నారు? అన్న‌ది తెలియాలంటే ఇదిగో ఈ ఫోటోల్ని చూడాల్సిందే. మాస్ మ‌హారాజా కుమారుడు మ‌హాధ‌న్ ఇప్ప‌టికే నూనూగు మీసాల వ‌య‌సుకు వ‌చ్చేశాడు. కాలేజ్ స్ట‌డీస్ పూర్తి చేసుకుంటే హీరో అయిపోవ‌డ‌మే బ్యాలెన్స్. ఇక‌పోతే అత‌డు హీరో అవ‌తాడో లేదో ఇప్పుడే చెప్ప‌లేమ‌ని ర‌వితేజ ఇంత‌కుముందు ప‌లు ఇంట‌ర్వ్యూల్లో వెల్ల‌డించారు. అయితే రాజా వార‌సుడిలో మాత్రం హీరోయిక్ క‌ళ ఉట్టిప‌డుతోంది. ఇంత‌కుముందు మ‌హాధ‌న్ రాజా ది గ్రేట్ చిత్రంలో జూ.ర‌వితేజ‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు కుమార్తె మోక్ష‌ద మాత్రం బ‌బ్లీగా క‌నిపిస్తోంది. త‌ను ప్ర‌స్తుతం స్ట‌డీస్ ప‌రంగా బిజీగా ఉన్నార‌ని స‌మాచారం. ఇక వీళ్లిద్ద‌రితో పాటు త‌మ క‌జిన్స్ తోనూ ర‌వితేజ ఇచ్చిన ఫోజులు వైర‌ల్ గానే మారాయి. వీట‌న్నిటినీ ర‌వితేజ ట్విట్ట‌ర్ ద్వారా ఫ్యాన్స్ కి షేర్ చేశారు.

ఇక కెరీర్ సంగ‌తి చూస్తే.. కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత కంబ్యాక్ అయ్యేందుకు బ‌లుపు ఫేం గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. క్రాక్ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ముగింపులో ఉంది. మే 8న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ వ‌ల్ల ఆల‌స్య‌మైంది. త‌దుప‌రి అప్ డేట్ తెలియాల్సి ఉందింకా.