సినిమాల్లోకి మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ చాలా లేట్‌గా జరిగింది. అయినా సరే ఎక్కడా తగ్గకుండా తన జోష్‌తో గత కొంత కాలంగా నెట్టురొస్తున్నాడు. తనదైన డైలాగ్ డెలివరీతో డిఫరెంట్ మ్యానరిజమ్స్‌తో ఆకట్టుకుంటూ వస్తున్న రవితేజ జోరు ఈ మధ్య కాస్త తగ్గింది. ఓకే మూస పాత్రలు, ఏ పాత్ర చేసినా అదే యాస వినీ వినీ జనాలకి బోరుకొట్టింది. ఆ దెబ్బతో రవితేజకు వరుస ఫ్లాపులు మొదలయ్యాయి.
రీసెంట్‌గా వచ్చిన `డిస్కోరాజా` కూడా డింకీ కొట్టేసింది. దీంతో పంథా మార్చాలని డిసైడ్ అయిన మాస్ రాజా వరుస సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `క్రాక్` సినిమా చేస్తున్న రవితేజ ప్రస్తుతం రెండు నుంచి మూడు చిత్రాల్ని లైన్‌లో పెట్టేశాడు. యాభై ఏళ్లకు దగ్గరపడుతున్న రవితేజ ఫిట్ నెస్ విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. ఆ మధ్య యంగ్ హీరోలకు ధీటుగా సిక్స్ ప్యాక్ ట్రై చేసి పీక్కుపోయిన మాస్ రాజా ఈ లాక్ డౌన్ టైమ్‌ని వృధా చేయడం లేదు.
జిమ్‌లో గడిపేస్తూ వర్కవుట్‌లు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియలో చక్కర్లు కొడుతోంది. షాకింగ్ విషయం ఏంటంటే రవితేజ జిమ్‌లో తన ఒరిజినల్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో కనినించడం ఫ్యాన్స్‌ని షాక్‌కు గురిచేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ చారల బనియన్‌లో తెల్లని గడ్డంతో రవితేజ ఒరిజినల్ లుక్ వైరల్‌గా మారింది.