కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. దీని భారి నుంచి బయటపడటం కోసం యావత్ ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ని విధించాయి. దీని కారణంగా జనజీవితం మొత్తం స్థంభించి పోయింది. ఎక్కడి వారు అక్కడే అన్నట్టు ఇళ్లకే పరిమితమైపోయారు.
ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా ఫ్యామిలీకి దూరంగా తిరిగిన వాళ్లంతా ఇప్పడు ఫ్యామిలీని అంటిపెట్టుకుని వుంటున్నారు.ఈ క్వారెంటైన్ టైమ్‌లో ఇంటి పట్టునే వుండి కొత్త కొత్త అనుభూతుల్ని.. ఇంత కాలం ఊరుకుల పరుగుల జీవితంలో ఏం మిస్సయ్యారో వాటిని అనుభవిస్తున్నారు. సరికొత్త అనుభూతికి లోనవుతున్నారు.
మాస్ మహారాజా తన కుటుంబ సభ్యులని ఏ ఫంక్షన్‌లోనూ చూపించలేదు. సోషల్ మీడియా వేదికగా కూడా వారి ఫోటోలని షేర్ చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఈ క్వారెంటైన్ వేళ ఇంటి పట్టునే వుంటూ పిల్లలతో టైమ్‌ని ఎంజాయ్ చేస్తున్న హీరో రవితేజ ఈ ఆదివారం తన కొడుకు, కూతురితో కలిసి వున్న ఓ ఫొటోని షేర్ చేశాడు. దీనికి `ఈ క్వారెంటైన్ టైమ్‌లో ప్రతీ రోజూ సండేనే` అంటూ క్యాప్షన్ ఇవ్వడం ఆకట్టుకుంటోంది.