ఈ నెల్లోనే రవితేజ నెక్ట్స్,ముహూర్తం పెట్టేసారు

ఒకప్పుడు హిట్స్ మీద హిట్స్ ఇచ్చిన రవితేజ గత కొంతకాలంగా తన తేజం కోల్పోయారు. వరస ఫ్లాపులలో మునిగి తేలుతున్నారు. ఎన్నో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుని , తన చిరకాల మిత్రుడు శ్రీనువైట్ల తో కలిసి చేసిన‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రం డిజాస్టర్ సైతం ఊహించని దెబ్బే. దాంతో హ్యాట్రిక్ పరాజయాలను ఖాతాలో వేసుకున్న రవితేజ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. అందుకు తగ్గ దర్శకుడు విఐ ఆనంద్ అని భావించి సినిమా మొదలెడుతున్నారు.

నిఖిల్ తో ‘ఎక్కడిపోతావు చిన్నవాడా’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ నటించనున్న కొత్త చిత్రం నవంబర్ 23న లాంచ్ కానుంది. అదే రోజు ఈచిత్రం యొక్క టైటిల్ లోగో ను కూడా విడుదల చేయబోతున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై ‘నేల టిక్కెట్టు’ నిర్మాత రవి తాళ్లూరి నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ డ్యూయెల్ రోల్లో కనిపించనున్నారు.

రవితేజ కెరీర్ లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన తమన్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో నాబా నటేష్ , పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటించనున్నారు. మరో హీరోయిన్ ను ప్రకటించాల్సి వుంది. డిసెంబర్ నుండి ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఈ సినిమా తోనైనా హిట్ కొట్టి రవితేజ తిరిగి ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.