రవితేజకు వేరే దారిలేకే..రామ్ చరణ్ రూట్ లోకి

రామ్ చరణ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన రంగంస్దలం సినిమా చాలా మంది హీరోలకు ప్రేరణగా మారింది. ఈ సినిమా కథ అంతా 1980 లో జరుగుతుంది. సినిమాలో ట్విస్ట్ లతో పాటు ఇలాంటి పీరియడ్ లుక్ కూడా సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. దాంతో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు రవితేజ కూడా 1980 లలో జరిగే కథను ఓకే చేసారు. సినిమాలో ఆయన రెట్రో లుక్ లో కనపడనున్నారు. డైలాగుల నుంచి అన్ని విషయాల్లో ఆ కాలం నాటి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా , ఒక్క క్షణం ‘చిత్రాల దర్శకుడు వి . ఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నాడు రవితేజ. సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ చిత్రానికి డిస్కోరాజా అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. 1980 బ్యాక్ డ్రాప్‌లో పీరియాడిక్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుంద‌ని సమాచారం. చిత్రంలో ర‌వితేజ రెండు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడు. అందులో ఒకటి కొడుకు పాత్ర కాగా మరొకటి తండ్రి పాత్ర అని తెలుస్తుంది .

రవితేజ గతంలో విక్రమార్కుడు , కిక్ 2 చిత్రాల్లో రెండు పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుండ‌గా, ఇందులో హీరోయిన్స్ గా పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేష్‌ల‌ని ఎంపిక చేశారు. థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ త‌ళ్లూరి నిర్మాణంలో ఈ మూవీ తెర‌కెక్క‌నుంది. డిసెంబర్ నుండి ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఈ సినిమా తోనైనా హిట్ కొట్టి రవితేజ తిరిగి ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.