వైరల్ అవుతున్నరష్మిక  రెమ్యూనరేషన్ కథనాలు!

వైరల్ అవుతున్నరష్మిక  రెమ్యూనరేషన్ కథనాలు!

 
 కన్నడ బ్యూటీ రష్మిక మండన్నడిమాండ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. చిత్రసీమలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ఇమేజ్ ను సృష్టించుకుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలన్న నానుడిని తు.చ తప్పకుండా అమలు చేస్తూ కెరీర్ ను మలచుకుంటోంది. తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న రష్మిక -చలోతో అడుగు పెట్టి గీత గోవిందంతో క్రేజీ గాళ్‌గా ఎదిగిపోయింది. వెంటనే సూపర్‌స్టార్ మహేష్ సరసన హీరోయిన్‌గానూ ఛాన్స్ దక్కించుకుంది.
 
ప్రస్తుతం టాలీవుడ్‌లో రష్మికకు టాప్ డిమాండ్ ఉంది. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకునే పనిలో పడింది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో రష్మిక రెమ్యూనరేషన్ పెంచేసిందన్న న్యూస్ వైరల్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీ అయిన రష్మిక, తాజాగా రెండోసారి విజయ్ దేవరకొండతో జోడీకట్టి ‘డియర్ కామ్రేడ్’లో నటించింది. ఇది ఇలా ఉండగా రష్మిక మండన్నపై సోషల్ మీడియాలో బోలెడు కథనాలు వెలువ డుతుంన్నాయి.   రెమ్యూనరేషన్ బాగా పెంచేసి నిర్మాతలకు బెంబేలెత్తిస్తోంది అని నెటిజనులు  తమకు ఇష్టం వచ్చిన రీతిలో పోస్టులు పెడుతూ తమ కసిని తీర్చుకుంటున్నారు.  
 
ఈ  రెమ్యూనరేషన్ కథనాలపై స్పందించిన రష్మిక … పారితోషికం పెంచడం సాధారణ విషయమే. కొన్నేళ్లుగా  ఇండస్ట్రీలో ఉంటున్నా. నటిగా నా ఎదుగుదలలో మార్పు ఉన్నప్పుడు.. అందులో పారితోషికమూ భాగమవుతుంది అంటూ కౌంటర్ వేసింది.  సోషల్ మీడియాలో నెటిజనులు పిచ్చి పోస్టులు పెడుతూ తమ విలువని దిగజార్చుకుంటున్నారు. వారి పోస్టులకు ఏ మాత్రం ఫీలవ్వను.  నా కెరీర్ నా ఇష్టం. సోషల్ మీడియా ఫ్రెండ్స్ కి ఒకటే చెప్పదలుచుకున్న తమ పోస్టుల్లో నిజాలుండాలి అలా ఉన్నప్పుడే వాటికీ విలువ ఉంటుంది. అని చెప్పుకొచ్చింది. దటీజ్ రష్మిక మండన్న!!