మ‌ళ్లీ రంగ‌స్థ‌లం కాంబినేష‌న్..ఈసారి బాహుబ‌లిని కొట్టేలా!

మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ని `రంగ‌స్థ‌లం` కాంబినేష‌న్ ప్లాన్ చేస్తుందా? ఈసారి టార్గెట్ బాహుబ‌లి వ‌సూళ్లేనా? కోడ్తే బాక్సాపీస్ బ‌ద్ద‌ల‌య్యేలాగే ఆ ద్వ‌యం రంగం సిద్దం చేస్తుందా? అంటే అవున‌నే సంకేతాలందుతున్నాయి. గ‌తంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌- విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `రంగస్థ‌లం` బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి రికార్డులు న‌మోదు చేసిందో చెప్పాల్సిన ప‌నిలేదు. నాన్ `బాహుబ‌లి` రికార్డుల‌ను చెరిపేసి బాక్సాఫీస్ వ‌ద్ద‌ కొత్త  రికార్డుల‌ను న‌మోదు చేసింది. కొన్ని ఏరియా వ‌సూళ్ల‌లో బాహుబ‌లి రికార్డుల‌నే బీట్ చేసింద‌న్న‌ది అనధికారిక స‌మాచారం. నిజానికి ఈ కాంబినేష‌న్ లో సినిమా అంటే అప్ప‌ట్లో పెద్ద‌గా అంచ‌నాలేవి ఏర్ప‌డ‌లేదు.

రిలీజ్ కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోన్న స‌మ‌యంలో ఓవ‌ర్సీస్ లో వ‌ర్కౌట్ అవుతుందా? టాలీవుడ్ ఆడియ‌న్స్ ఈ ప్ర‌యోగాన్ని అంగీక‌రిస్తారా? అని చాలా సందేహాలు వ్య‌క్తం అయ్యాయి. కానీ వాట‌న్నింటిని ప‌టాపంచ‌ల్ చేస్తూ రంగ‌స్థంలో బాక్సాఫీస్ నే షేక్ చేసింది. ఈ షేకింగ్ ని చిత్ర ద‌ర్శ‌కుడు గానీ, హీరోగాని అస్స‌లు ఊహించ‌లేదు. అంత‌టి ఘ‌న విజ‌యాన్ని అన్ని చోట్లా అందించారు ప్రేక్ష‌కాభిమానులు. తాజాగా మరోసారి ఈ కాంబిన‌ష‌న్ రెండ‌వ‌సారి చేతులు క‌ల‌ప‌డానికి రెడీ అవుతోంద‌ని ఇన్ సైడ్ జోరుగా టాక్ వినిపిస్తోంది. చ‌ర‌ణ్ కోసం సుక్కు మైండ్ లో అదిరిపోయే మూడు స్ర్కిప్ట్ లు ఉన్నాయ‌ట‌. అందులో ఒక‌టి చ‌ర‌ణ్ కోసం ఎంపిక చేసుకోవ‌డ‌మే ఆల‌స్య‌మంటున్నారు.

అయితే ఇది ఇంకా సుక్కు మైండ్ లో థాట్ ప్రోస‌స్ లోనే ఉందిట‌. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ `ఆర్ ఆర్ ఆర్` లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా 30 శాతం బ్యాలెన్స్ ఉంది. అది పూర్తయ్యాక మరో సినిమా చేసే ఆలోచనలో చ‌ర‌ణ్ ఉన్నాడు. ఈలోపు సుకుమార్ బన్నీతో తీస్తున్న ‘పుష్ప’ ను పూర్తి చేస్తాడు. ఆ త‌ర్వాత సుకుమార్ ఈ కొత్త ప్రాజెక్ట్ పై సీరియ‌స్ గా ఆలోచ‌న చేయ‌నున్నాడ‌ని ప‌రిశ్రమ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆల‌స్య‌మైనా కాంబినేష‌న్ లో మాత్రం సినిమా ప‌క్కాగా ఉంటుంద‌ని అంటున్నారు. అయితే అందుకు ఎలా లేద‌న్నా! ఏడాదికి పైగానే స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్‌-సుకుమార్ బిజీ షెడ్యూల్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికే ఏడాది ప‌డుతుంది. ఆపై సుకుమార్ స్ర్కిప్ట్ సిద్దం చేయాలి. స్ర్కిప్ట్ కు త‌గ్గ‌ట్టు చ‌ర‌ణ్ ని రెడీ చేయాలి. ఇలా అన్ని ప‌నులు పూర్తిచేసి సెట్స్ కు తీసుకెళ్లాలంటే ఏడాదిన్న‌ర‌కు పైగానే స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles