ఆ రెండు లైన్స్ రణరంగం
స్ఫూర్తి
వెర్సటైల్ స్టార్ శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో `రణరంగం` తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈనెల 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ ఈ చిత్రంలో కథానాయికలు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో శర్వా రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఒకటి గ్యాంగ్ స్టర్ లుక్. మరొకటి మాస్ యువకుడి లుక్. ఇవి ఇప్పటికే ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి.
అయితే ఈ సినిమాకి స్ఫూర్తి ఎక్కడి నుంచి అంటే.. యథావిధిగానే రామో గోపాల్ వర్మ ఫార్ములాలో గాడ్ ఫాదర్
లైన్ ని ఎంచుకున్నాడట సుధీర్ వర్మ. ఆ థీమ్ ని ఎంచుకుని తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించే కథనం రాసుకున్నాడట. 1990 బ్యాక్ డ్రాప్ కి నేటి కాలానికి సంబంధం ఏమిటి? అన్నది ఆసక్తికరం. నాటి వాతావరణాన్ని భారీ సెట్స్ లో క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ మధ్య నిషేధం నాటి సమయంలో వైజాగ్ ఒరిస్సా లాంటి ప్రాంతాలు.. కాకినాడ పోర్ట్ ని ఇందులో చూపిస్తున్నారట. అలాగే ఈ సినిమాలో ఓ ట్రెయిన్ ఎపిసోడ్ హైలైట్ గా ఉంటుంది. దానికి స్ఫూర్తి వేరొక హాలీవుడ్ సినిమాలో సన్నివేశం అని దర్శకుడు ఓపెన్ గానే వెల్లడించారు. ది అసాసియేషన్ ఆప్ జెస్సీ జేమ్స్
నుంచి ట్రైన్ ఎపిసోడ్ ఇన్ స్పయిర్ అయ్యానని సుధీర్ వర్మ వెల్లడించారు. ఈ సినిమాని చాలా తక్కువ మంది చూసి ఉంటారు. నేను చెప్పిన తర్వాత ఆ సినిమా చూస్తారు చాలామంది. ముందే చెప్పేస్తే ఇక ఫలానా సినిమా నుంచి కాపీ కొట్టారు అని మీరు అనరు కదా? అందుకే ఓపెన్ గానే చెప్పేస్తున్నా! అని సుధీర్ వర్మ అన్నారు.