Home News కొద్ది రోజులు భ‌ర్త‌కు దూరంగా కాజ‌ల్‌..కొత్త జంట‌ని విడ‌గొట్టేదెవ‌రు?

కొద్ది రోజులు భ‌ర్త‌కు దూరంగా కాజ‌ల్‌..కొత్త జంట‌ని విడ‌గొట్టేదెవ‌రు?

కుంద‌న‌పు బొమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇప్పుడు కాజ‌ల్ కిచ్లుగా మారింది. ప్ర‌ముఖ బిజినెస్‌మెన్ గౌత‌మ్ కిచ్లుని అక్టోబ‌ర్ 30న వివాహం చేసుకున్న కాజ‌ల్ ప్ర‌స్తుతం హ‌నీమూన్ ట్రిప్‌తో బిజీబిజీగా ఉంది. మాల్దీవులు మొత్తాన్ని జ‌ల్లెడ ప‌డుతున్న ఈ జంట మ‌రికొద్ది రోజుల‌లో ముంబైకి రానున్నారు. ఇన్నాళ్ళు భ‌ర్త‌తో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపిన కాజ‌ల్ కొద్ది రోజుల పాటు ఆయ‌న‌కు దూరంగా ఉండ‌నుంది. మ‌రి వీరిద్ద‌రి ఎవ‌రు విడ‌గొడుతున్నారు అనే ఆస‌క్తి, ఆతృత మీలోను ఉంది కదా! ఈ స్టోరీ చ‌దివితే మీకే అర్ధ‌మ‌వుతుంది.

Kajal Hot | Telugu Rajyam

సినీ ఇండ‌స్ట్రీలో స‌క్సెస్‌ఫుల్‌గా 15 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న కాజ‌ల్ ఇప్ప‌టికీ వ‌రుస సినిమాల‌తో దూసుకెళుతూనే ఉంది. తెలుగు, త‌మిళం, హిందీ సినిమాల‌తో పాటు ప‌లు వెబ్ సిరీస్‌లు చేసేందుకు స‌న్న‌ద్ధ‌మైంది. క‌రోనా వ‌ల‌న దాదాపు ఏడు నెల‌లు ఇంటికే ప‌రిమిత‌మైన కాజ‌ల్ అక్టోబ‌ర్ 30న త‌న మెడ‌లో గౌత‌మ్‌తో మూడు ముళ్ళు వేయించుకుంది. ఇక కొత్త పెళ్ళి కూతురు కాబ‌ట్టి కొద్ది రోజుల పాటు ఫ్యామిలీతోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతుంది. డిసెంబ‌ర్ నుండి త‌ను ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేసేందుకు రంగంలోకి దిగుతుంద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ చిత్రం కొద్ది రోజుల క్రితం సెట్స్ పైకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. చిరు, కాజ‌ల్ లేకుండానే కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్న కొర‌టాల డిసెంబ‌ర్ నుండి హీరోహీరోయిన్స్‌పై సింగిల్ షెడ్యూల్‌లో అన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తాడ‌ట‌. ఇందులో భాగంగా కాజ‌ల్ డిసెంబ‌ర్ 5న చిత్ర బృందంతో క‌ల‌వ‌నుంద‌ని టాక్ . ఈ సినిమా పూర్తైన త‌ర్వాత వెంట‌నే భార‌తీయుడు 2, ముంబై సాగా చిత్రాల షూటింగ్ పూర్తి చేయ‌నుంది. మ‌రోవైపు గ్లోబ‌ల్ భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో ఏబీసీ ఛానల్‌తో కలిసి ‘క్వాంటికో’ అనే సీరీస్ ను ఇప్పుడు ఇండియ‌న్ వర్షెన్ లో కాజ‌ల్ చేయ‌నుంది.నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇప్ప‌టికే రంగం సిద్ధం చేయ‌గా, త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఈ వెబ్ సిరీస్‌తో పాటు కాజల్.. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రుపొందిస్తున్న మరో వెబ్‌సిరీస్‌లో కాజల్ నటిస్తోంది. ఇది హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ ర‌కంగా కాజ‌ల్ కాల్షీట్స్ ఫుల్ బిజీబిజీగా ఉండ‌గా కొద్ది రోజుల పాటు త‌న భ‌ర్త‌కు కాజ‌ల్ దూరం కాక త‌ప్ప‌దు. అయితే వీలున్న‌ప్పుడ‌ల్లా త‌న భ‌ర్త‌ను క‌లిసే మాత్రం కాజ‌ల్ అస్స‌లు మిస్ చేసుకోదు అనుకోండి. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నందుకేనేమో కాజ‌ల్ దాదాపు రూ. 40 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి త‌న భ‌ర్త‌తో ఏకాంత స‌మ‌యం గ‌డుపుతుంది.

- Advertisement -

Related Posts

భక్తితో ఇచ్చిన కానుకను తిరస్కరించారని ప్రభుత్వం మీద అశోక్ గజపతి రాజు ఫైర్

ఆంధ్రప్రదేశ్: విజయనగరం జిల్లాలో గజపతి రాజులు గురించి, చెప్పాల్సిన పని లేదు. ఆ కుటుంబం త్యాగాల ముందు, ఇందిరా గాంధీ లాంటి నేత కూడా గౌరవంగా తల వంచి నమస్కారం పెట్టారంటే, ఆ...

మారవయ్యా జగనూ. మళ్ళీ కోర్టు టిడితే తిట్టింది అంటావు

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయాలు నాయకలు ప్రజల యొక్క సమస్యల గురించి తప్ప అన్నింటి గురించి చర్చిస్తున్నారు, పోరాడుతున్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో...

వీర్రాజు ఆవేశంతో అభాసు పాలైన బీజేపీ ? ఇది చెయ్యకూడని తప్పు ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ జెండాను పాతడానికి బీజేపీ నాయకులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ తమకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ కు చుక్కలు...

ఒక పక్క వ్యాక్సీన్ వేస్తుంటే – సడన్ గా భారీ ట్విస్ట్ ?

కరోనా వ్యాధికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమయింది. మొదట ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమయింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… ముందుగా టీకాలు తీసుకునేవారితో మాట్లాడి.. నాలుగు మంచి మాటలు...

Latest News