చీప్‌గా బిహేవ్ చెయ్యకు… కాజల్‌పై మంచు లక్ష్మీ ఆగ్రహం

టాలీవుడ్‌లో మంచు లక్ష్మీకి ఉన్న పరిచయాలు మరెవ్వరికీ ఉండవేమో. ప్రతీ హీరో, హీరోయిన్లు మంచు లక్ష్మీకి టచ్ లోనే ఉంటారు. మరీ ముఖ్యంగా మనోజ్, విష్ణులతో చేసిన హీరోయిన్లు అయినా, మంచు బ్యానర్‌లో చేసిన హీరోయిన్లైనా ఎప్పుడూ ఆమెకు టచ్‌లోనే ఉంటారు. రకుల్, రెజీనా, తాప్సీ, కాజల్ ఇలా ఎంతో మంది హీరోయిన్లు మంచు లక్ష్మీతో స్నేహం చేస్తుంటారు. రోజు ఫోన్‌లో మాట్లాడుకుంటామని చెబుతుంటారు. సరదాగా వెకేషన్స్‌కు కూడా వెళ్తుంటారు.

Manchu Lakshmi Comments On Kajal Aggarwal Marriage party

అయితే తన స్నేహితురాలు కాజల్ పెళ్లి చేసుకోవడంపై మంచు లక్ష్మీ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లూతో కాజల్ పెళ్లి అయిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై తాజాగా మంచు లక్ష్మీ స్పందించింది. మంచులక్ష్మీ ఓ ఇంటర్వ్యూలో భాగంగా కాజల్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ తన బెస్ట్ ఫ్రెండ్ కాజల్.. ఈ లాక్ డౌన్‌లో పెళ్లి చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందని చెప్పింది.

Manchu Lakshmi Comments On Kajal Aggarwal Marriage party

నిజానికి పెళ్లికి ముందు మేము చాలా విషయాలు మాట్లాడుకున్నామని అసలు సంగతులు బయటకు చెప్పింది. కాజల్.. నువ్వు లాక్‌డౌన్‌లో పెళ్లి చేసుకొంటున్నావు కాబట్టి పార్టీ అడగడం లేదు. అలా అని మాకు పార్టీ ఇవ్వకుండా ఎస్కేప్ అవ్వొద్దని హెచ్చిరించిదట. ఆ విషయంలో మాత్రం చీప్‌గా బిహేవ్ చెయ్యకని చురకలు అంటించిదట.. పరిస్థితులు అన్నీ సెట్ అయ్యాక పెద్ద పార్టీ అరెంజ్ చెయ్యాలని హుకుం జారీ చేశానని మంచు లక్ష్మీ అసలు విషయాన్ని బయటకు చెప్పేసింది.