అక్టోబర్ 30న తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ ప్రతి రోజు వార్తలలో నిలుస్తూనే ఉంది. పెళ్ళికి ముందు మెహందీ, హల్దీ వేడుకలతో రచ్చ చేసిన కాజల్ తర్వాత రిసెప్షన్ ఇంట్లో పూజ ఆ తర్వాత హనీమూన్ ట్రిప్ ఈ విషయాలతో ప్రతి రోజు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. ప్రస్తుతం తన భర్తతో మాల్దీవులలో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న కాజల్ చాలా రిచ్ లైఫ్ గడుపుతుందట. ప్రతి రోజు ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలని చూస్తుంటే అర్ధమవుతుంది. కాజల్ రోజుకు ఎంత ఖర్చుచేస్తుందనేది!
అండర్ వాటర్‌లో కాజల్ దంపతులు దిగిన ఫొటోలు అభిమానుల మనసులని ఎంతగానో గెలుచుకున్నాయి. వాటర్ లోపల వీరు చేస్తున్న ఎంజాయ్ ని చూసి కొంత మంది సెలబ్స్ అసూయ కూడా చెందుతున్నారట. దాదాపు వారానికి పైగా హనీమూన్‌ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ దంపతులు ఈ టూర్ కోసం అక్షరాలా రూ. 40 లక్షలు ఖర్చు చేశారట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం అంటున్నారు. నీలి రంగు సముద్రాన్ని ఎంజాయ్ చేస్తూ, ఇసుక తిన్నెలలో విహరిస్తూ, వెన్నెల రాత్రులని ఎంజాయ్ చేస్తున్నందుకు ఆ మాత్రం ఖర్చయ్యే ఉంటుందని కొందరి టాక్. అయితే హనీమూన్ కోసం ఇంత ఖర్చు పెట్టిన తప్పులేదని ఈ జంట భావించినట్టు తెలుస్తుంది.
అయితే కాజల్-గౌతమ్ జంటకు రూ.40 లక్షలు పెద్ద ఖర్చేమి కాదు కాని వారి సంతోషానికి ఇంత ఖర్చు పెట్టే బదులు అందులో కొంత అయిన పేదలకు సాయం చేస్తే చాలా పుణ్యం వస్తుంది కదా అని కొందరు నెటిజన్స్ సలహాలు ఇస్తున్నారు. ఏదేమైన ఈ అమ్మడు తన హనీమూన్‌ని సూపర్‌గా ఎంజాయ్ చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాజల్ హనీమూన్ నుండి తిరిగి వచ్చిన వెంటనే ఆచార్య టీంతో జాయిన్ కానుంది. మధ్యలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.