రణరంగం డే వన్ షేర్ ఎంత?
శర్వానంద్ కథానాయకుడిగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం రణరంగం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు 16 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. అయితే తొలిరోజు ఓపెనింగులకు మాత్రం డోఖా లేదని తాజాగా ట్రేడ్ రిపోర్ట్ అందింది.
ఈ సినిమా టీజర్, ట్రైలర్ సహా శర్వానంద్ ఇంటెన్సిటీ మెప్పించడంతో చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ దక్కాయని తెలుస్తోంది. ఏరియా వైజ్ షేర్ వివరాలు పరిశీలిస్తే…నైజాం-1.41కోట్లు, వైజాగ్-0.51కోట్లు, తూ.గో జిల్లా-36లక్షలు, ప.గో జిల్లా-28లక్షలు, కృష్ణ-23లక్షలు, గుంటూరు 36లక్షలు, నెల్లూరు 18లక్షలు, సీడెడ్ 48లక్షలు వసూలైంది. కేవలం ఆంధ్రా 1.92కోట్లు వసూలైంది. ఆంధ్రా, నైజాం కలుపుకుని 3.81కోట్లు కలెక్ట్ చేసింది. రెస్టాఫ్ ఇండియా 42లక్షలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 4.23 కోట్లు షేర్ వసూలు చేసింది. గ్రాస్ వివరాలు పరిశీలిస్తే.. నైజాం-2.2కోట్లు, ఆంధ్రా -2.7కోట్లు, సీడెడ్ -60లక్షలు, నైజాం, ఆంధ్రా కలుపుకుని 5.5కోట్ల గ్రాస్ వసూలైంది. రెస్టాఫ్ ఇండియా 1.1 కోట్లు (అంచనా) వసూలైంది. ప్రపంచవ్యాప్తంగా 6.6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. గుడ్ ఓపెనింగ్ అంటూ రిపోర్ట్ అందింది.