`సైరా`కు `వార్` పోటీ.. దిమ్మతిరిగే ఆన్సర్!
ఒకేరోజు రెండు భారీ చిత్రాలు రిలీజైతే ఆ మేరకు ఓపెనింగులపై ప్రభావం ఉంటుందనేది ట్రేడ్ విశ్లేషణ. ఒకదాని వసూళ్లు ఇంకొకటి షేర్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ మేరకు కలెక్షన్లు తగ్గే వీలుంటుంది. అయితే ఇదే సందేహాన్ని సైరా
హిందీ వెర్షన్ నిర్మాత ఫర్హాన్ అక్తర్ ముందు వ్యక్తం చేస్తే అతడు ఇచ్చిన సమాధానం ఆసక్తికరం. సైరా
ముంబై ఈవెంట్ లో అతడికి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. సైరా
అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా రిలీజవుతోంది. అదేరోజు మీ స్నేహితుడు హృతిక్ రోషన్ నటించిన వార్
చిత్రం రిలీజవుతోంది కదా? రెండు భారీ చిత్రాల ఢీ కలెక్షన్లకు ఇబ్బందే కదా? అని ప్రశ్నించారు.
ఓపెనింగులపై ప్రభావం ఉంటుంది కదా?
దానికి అతడు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అప్పట్లో హృతిక్ రోషన్ నటించిన కాబిల్, షారూక్ నటించిన రాయీస్ చిత్రాలు ఒకేరోజు ఇలానే క్లాష్ అయ్యాయి. కానీ ఆ రెండు సినిమాలు గొప్పవే. చక్కని వసూళ్లను దక్కించుకున్నాయి. కంటెంట్ నచ్చితే జనాలు మరుసటి రోజు అయినా సినిమా చూసేస్తున్నారు. గురువారం కాబిల్ కి వెళితే అదే ప్రేక్షకులు శుక్రవారం రాయీస్
చిత్రాన్ని చూసి ఆదరించారు. అందుకే అవి రెండూ విజయం సాధంచాయి. అలానే సైరా, వార్ చిత్రాలు ఘనవిజయం సాధిస్తాయనే భావిస్తున్నాను. ఇవి రెండూ రెండే… ఆసక్తికర జోనర్లతో వస్తున్నాయి అని అన్నారు. సైరా చిత్రాన్ని ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రితేష్ సిధ్వానీతో కలిసి ఫర్హాన్ అక్తర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తమకు ఎదురయ్యే ప్రశ్నలకు ఆ ఇద్దరూ ఇలా సమాధానాలివ్వడం ఆసక్తికరం. అయితే బాహుబలి తర్వాత అదే తరహాలో సైరా
కు హిందీ ఆడియెన్ పట్టంగడతారా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. సైరా కంటే నెలరోజుల ముందే ఆగస్టు 30న సాహో
చిత్రం సంచలనాలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం హిందీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.