ప్రపంచవ్యాప్తంగా `సాహో` వసూళ్ల ప్రభంజనం కొనసాగింది. క్రిటిక్స్ మిశ్రమ స్పందనల నడుమ తొలి రోజు, తొలి వీకెండ్ రికార్డులు బ్రేక్ చేసి సత్తా చాటింది. ఈ సినిమా నెగెటివ్ టాక్ తో సంబంధం లేకుండా తొలి మూడు రోజులు అద్భుత వసూళ్లను సాధించింది. చిత్రబృందం తొలి రెండ్రోజుల్లోనే 200 కోట్ల క్లబ్ లో చేరిందని అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది. తాజాగా ఆంధ్రా బాక్సాఫీస్ అందించిన ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం.. `సాహో` తొలి మూడు రోజుల్లో 276 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ .. 153 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది.
సాహో తొలి వీకెండ్ ఏరియా వైజ్ షేర్ రిపోర్ట్ పరిశీలిస్తే… వైజాగ్ -6.62 కోట్లు, తూ.గో జిల్లా-5.68 కోట్లు, ప.గో.జిల్లా-4.61కోట్లు, కృష్ణ-3.90కోట్లు, గుంటూరు-6.34కోట్లు, నెల్లూరు-3.26కోట్లు, ఆంధ్రా-30.41కోట్లు, సీడెడ్ -8.40కోట్లు, నైజాం-2.038 కోట్లు వసూలైంది. ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ కలుపుకుని 59.19కోట్ల షేర్ వసూలైంది. కర్నాటక-12.90కోట్లు, తమిళనాడు-4.26కోట్లు, కేరళ-1.21కోట్లు, రెస్టాఫ్ ఇండియా-47.50కోట్లు వసూలైంది. మొత్తం భారతదేశం నుంచి 125.06కోట్లు వసూలు చేసింది. అమెరికా-9.35కోట్లు, యూఏఈ-9.50కోట్లు, ఆస్ట్రేలియా-1.95కోట్లు, ఆసియా-4.05 కోట్లు, యూరఫ్- 2.25కోట్లు, ఇతర ప్రపంచం నుంచి 0.80కోట్ల షేర్ వసూలైంది. ప్రపంచవ్యాప్తంగా 152.96 కోట్ల షేర్ వసూలైంది.
గ్రాస్ వివరాలు పరిశీలిస్తే.. ఆంధ్రా- 43.5 కోట్లు, సీడెడ్-10.8కోట్లు, నైజాం-30.5 కోట్లు, మొత్తం ఏపీ నైజాం కలుపుకుని 84.8 కోట్లు వసూలైంది. కర్నాటక-21.5 కోట్లు, తమిళనాడు-8.4కోట్లు, కేరళ- 2.6కోట్లు, ఇతర భారతదేశం నుంచి 102.4 కోట్లు గ్రాస్ వసూలైంది. మొత్తం భారతదేశం నుంచి 219.7 కోట్లు వసూలైంది. అమెరికా-17కోట్లు, యుఏఈ-19కోట్లు, ఆస్ట్రేలియా-4.3కోట్లు వసూలైంది. ఆసియా-9.0కోట్లు, యూరఫ్ -5కోట్లు, ఇతర ప్రపంచం నుంచి 2కోట్లు వసూలైంది. ప్రపంచవ్యాప్తంగా 276 కోట్లు వసూలు చేసింది.
రజనీ తర్వాత ప్రభాస్ కే ఆ ఛాన్స్
అలాగే నెట్ వివరాలు పరిశీలిస్తే.. ఆంధ్రా నుంచి 39.1కోట్లు, సీడెడ్- 10కోట్లు, నైజాం-27.3కోట్లు, మొత్తం ఏపీ నైజాం కలుపుకుని 76.4 కోట్లు కలెక్ట్ చేసింది. కర్నాటక- 18.6కోట్లు, తమిళనాడు- 7.1కోట్లు, కేరళ-2.2 కోట్లు వసూలైంది. ఇతర భారతదేశం నుంచి 86.4కోట్లు వసూలైంది. మొత్తం భారతదేశం నుంచి 190.7 కోట్లు వసూలైంది. తెలుగు సినిమా హిస్టరీలో టాప్ 3 సినిమాగా రికార్డుల్లో నిలిచింది. బాహుబలి2, బాహుబలి, సాహో .. ఈ మూడూ ప్రభాస్ నటించినవే కావడం ఆసక్తికరం. సౌతిండియా హిస్టరీలో సాహో ఆరో స్థానంలో నిలిచింది. సౌతిండియా టాప్ 6లో మూడు చిత్రాలు రజనీకాంత్ నటించినవి ఉంటే.. మూడు చిత్రాలు ప్రభాస్ నటించినవి ఉండడం ఆసక్తికరం.