‘రుద్రమదేవి’ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్, హీరో రానా కాంబినేషన్ లో రాబోతున్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘హిరణ్యకశ్యప’.దాదాపు 130 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పౌరాణిక గాథను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు గుణశేఖర్.
తన గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై తమిళ, హిందీ భాషల్లో ప్రముఖ నిర్మాతలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ విషయమై చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.
Exciting journey with @RanaDaggubati for హిరణ్యకశ్యప #Hiranyakashyapa #OmNamoNarayanaya pic.twitter.com/7GujaMz0nu
— Gunasekhar (@Gunasekhar1) June 1, 2019
ఈ రోజు గుణశేఖర్ ఈ చిత్రం విషయమై అఫీషియల్ గా ప్రకటన చేసారు. అంటే త్వరలో షూటింగ్ మొదలు కాబోతోంది అర్దం అన్నమాట.
ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న ‘హిరణ్యకశ్యప’ ఆగస్ట్ నుంచి సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ‘భక్త ప్రహ్లాద’ కథతో తెరకెక్కే ఈ చిత్రాన్ని అతని తండ్రి ‘హిరణ్యకశ్యప’ కోణంలో ఆవిష్కరించనున్నాడట గుణశేఖర్.
టైటిల్ రోల్‌లో మహా రాక్షసుడు హిరణ్యకశ్యపునిగా మెప్పించేందుకు ఆహార్యం, వాచికం విషయంలో ప్రత్యేక కసరత్తులు మొదలుపెట్టాడట రానా. విజువల్‌గా ఈ మైథలాజికల్ మూవీని అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రముఖ వి.ఎఫ్.ఎక్స్ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయట.