పరువును తీసుకున్నారు.. సుధీర్, గెటప్ శ్రీను, రాం ప్రసాద్ పరిస్థితి దారుణం!!

Ram Prasad Satirical Skit On Three Monkeys movie

సుఢిగాలి సుధీర్, ఆటో రాం ప్రసాద్, గెటప్ శ్రీను త్రయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడు ఈ త్రయం బుల్లితెరపై ఓ సంచలనం. స్టార్స్‌గా ఎదగక ముందు నుంచీ అంతే స్నేహంగా ఉన్న ఈ ముగ్గురు ఇప్పటికీ అదే బంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ ముగ్గురు బుల్లితెరపై సృష్టించిన సంచలనాలు.. వెండితెరపైనా క్రియేట్ చేయాలని తెగ తాపత్రయ పడుతున్నట్టున్నారు. అందులో భాగంగానే ముగ్గురు కలిసి ఓ సినిమాను కూడా తీశారు.

త్రీ మంకీస్ అంటూ ఈ ముగ్గురు కలిసి ఓ ప్రయత్నాన్ని చేశారు. కానీ అంతగా వర్కవుట్ కాలేదు. ఏది ఏమైనా బుల్లితెరపై క్రియేట్ అయ్యే మ్యాజిక్ వెండితెరపై సెట్ కాదని తెలుసుకున్నారు. అందుకే వారి సినిమా మీద వారే స్కిట్స్ వేసుకున్నారు. సినిమా పరువును తీసుకున్నారు. తాజాగా వేసిన స్కిట్స్‌లో త్రీ మంకీస్ సినిమాపైనే సెటైర్లు వేసుకున్నారు. త్రీ మంకీస్ సినిమాను ప్రదర్శిస్తున్నట్టు స్కిట్ వేశారు.

Ram Prasad Satirical Skit On Three Monkeys movie
Ram Prasad Satirical Skit On Three Monkeys movie

వెళ్లి టాయిలెట్స్ సరిగ్గా కడుకు థియేటర్లో జనాలు వస్తారు అని రాం ప్రసాద్ తన పనివాడికి చెబుతాడు. నడిచేది ఏ సినిమా చూడండి.. త్రీ మంకీస్ ఈ సినిమా ఇంటర్వెల్ వరకు కూడా ఎవ్వరూ ఉండరు అని కౌంటర్ వేస్తాడు. ఆపై గెటప్ శ్రీను వస్తే టికెట్ ధరను రూ. 500 అని చెబుతాడు. అవునా ఆ సినిమాకు ఐదు వేలు పెట్టి టికెట్ కొన్నా తక్కువే అని గెటప్ శ్రీను చెబుతాడు. మన సినిమాకు బాగానే సపోర్ట్ చేస్తున్నావ్‌రా అంటూ రాం ప్రసాద్ కౌంటర్ వేస్తాడు. చివరగా సన్నీ థియేటర్‌కు వస్తే.. తాగి వస్తావారా అని రాం ప్రసాద్ ఫైర్ అవుతాడు. తాగాను కాబట్టే ఇక్కడికి వచ్చాను. లేదంటే మంచి సినిమాకు వెళ్లేవాడిని అంటూ మొత్తం పరువుతీసేవాడు.